న‌య‌న‌తార‌.. చిరంజీవితో వ‌న్స్ మోర్..

చిరుతో ఒక్క‌సారి న‌టించే అవ‌కాశం వ‌స్తేనే ఈ త‌రం హీరోయిన్లు ఎగిరి గంతేస్తుంటారు. మ‌రి అలాంటిది రెండుసార్లు.. అది కూడా వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు వ‌స్తే ఇంకేం కావాలి..? ఇప్పుడు న‌య‌న‌తార విష‌యంలో ఇదే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే సైరాలో చిరుతో న‌టిస్తున్న న‌య‌న్ కు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా ఇండ‌స్ట్రీకి రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తుంటుంది. అందాల‌న్నీ ఆర‌బోస్తుంటారు.. అడిగిన ప్ర‌తీ ప‌నికి సై అంటుంటారు.

Nayanthara to Pair With Chiranjeevi

ఇంత చేసినా కూడా వాళ్ల కెరీర్ ఎన్నాళ్లుంటుందో క్లారిటీ లేదు. కానీ 13 ఏళ్లుగా న‌య‌న‌తార మాత్రం దున్నేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు లేడీ సూప‌ర్ స్టార్ గా మారిపోయి అస‌లు హీరోల‌తో ప‌నిలేకుండా ర‌ప్ఫాడిస్తుంది. ఆ మ‌ధ్య నెల రోజుల గ్యాప్ లో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. న‌య‌న‌తార ఓ క‌థ‌ ఓకే చేసిందంటే నిర్మాత నిశ్చింత‌గా నిద్ర‌పోతాడు.
హీరోలు రాజ్య‌మేలుతున్న ఈ ఇండ‌స్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాణం పోస్తుంది న‌య‌న‌తార‌. ఈమె న‌టిస్తున్న సినిమాల‌న్నీ ఫీమేల్ ఓరియెంటెడ్ క‌థ‌లే కావ‌డం విశేషం.

ద‌ర్శ‌కులు కూడా న‌య‌న‌తార‌ను దృష్టిలో పెట్టుకునే కొత్త క‌థ‌లు రాస్తున్నారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కు న‌య‌న్ ను మించిన ఆప్ష‌న్ మ‌రోటి క‌నిపించ‌ట్లేదు. గ‌త రెండు మూడేళ్ల‌లో ఆర‌మ్, డోర‌, నానుం రౌడీధానుం, ఇమైక్క నోడిగ‌ల్, కోకో లాంటి సినిమాల‌ను కేవ‌లం త‌న ఇమేజ్ తో న‌డిపించింది న‌య‌న‌తార‌. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది క‌దా.. హీరోల‌ను దూరంగా పెట్టిందేమో అనుకుంటే అది కూడా పొర‌పాటే. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు సూప‌ర్ స్టార్స్ తోనూ న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో చిరంజీవితో సైరా.. త‌మిళ్ లో అజిత్ విశ్వాసం సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది న‌య‌న్. ఇక ఇప్పుడు కొర‌టాల శివ‌-చిరంజీవి సినిమాలోనూ న‌య‌న‌తారే హీరోయిన్ గా న‌టించ‌బోతుంద‌నే టాక్ వినిపిస్తుంది. మ‌రి ఇది నిజ‌మైతే చిరుతో వ‌ర‌స‌గా రెండోసారి జోడీక‌ట్ట‌డం విశేష‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here