ఔరా.. అదిరింది న‌య‌న‌తార ఐరా..

ఇండ‌స్ట్రీకి రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తుంటుంది. అందాల‌న్నీ ఆర‌బో స్తుంటారు.. అడిగిన ప్ర‌తీ ప‌నికి సై అంటుంటారు. ఇంత చేసినా కూడా వాళ్ల కెరీర్ ఎన్నాళ్లుంటుందో క్లారిటీ లేదు. కానీ 13 ఏళ్లుగా న‌య‌న‌తార మాత్రం దున్నేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు లేడీ సూప‌ర్ స్టార్ గా మారిపోయి అస‌లు హీరోల‌తో ప‌నిలేకుండా ర‌ప్ఫాడిస్తుంది. ఈ మ‌ధ్యే నెల రోజుల గ్యాప్ లో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. న‌య‌న‌తార ఓ క‌థ‌ ఓకే చేసిందంటే నిర్మాత నిశ్చింత‌గా నిద్ర‌పోతాడు. హీరోలు రాజ్య‌మేలుతున్న ఈ ఇండ‌స్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాణం పోస్తుంది న‌య‌న‌తార‌.

Nayanthara 63rd film Airaa first look

ఈమె న‌టిస్తున్న సినిమాల‌న్నీ ఫీమేల్ ఓరియెంటెడ్ క‌థ‌లే కావ‌డం విశేషం. ద‌ర్శ‌కులు కూడా న‌య‌న‌తార‌ను దృష్టిలో పెట్టుకునే కొత్త క‌థ‌లు రాస్తున్నారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కు న‌య‌న్ ను మించిన ఆప్ష‌న్ మ‌రోటి క‌నిపించ‌ట్లేదు. గ‌త రెండు మూడేళ్ల‌లో ఆర‌మ్, డోర‌, నానుం రౌడీధానుం లాంటి సినిమాల‌ను కేవ‌లం త‌న ఇమేజ్ తో న‌డిపించింది న‌య‌న‌తార‌. ఈ మ‌ధ్యే నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన కోకో.. జ్ఞాన‌ముత్తుతో చేసిన ఇమైక్క నోడిగ‌ల్ సినిమాలు కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది క‌దా..

హీరోల‌ను దూరంగా పెట్టిందేమో అనుకుంటే అది కూడా పొర‌పాటే. ఇక ఇప్పుడు ఐరా అంటూ మ‌రో సినిమాతో వ‌స్తుంది న‌య‌న‌. ఇందులో డ్యూయ‌ల్ రోల్ చేస్తుంది ఈ భామ‌. ఒక‌టి డీ గ్లామ‌ర్ రోల్ కూడా. తాజాగా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. స‌ర్జ‌న్ ద‌ర్శ‌కుడు. క్రిస్ మ‌స్ కు సినిమా విడుద‌ల కానుంది. అలాగే తెలుగులో చిరంజీవితో సైరా.. త‌మిళ్ లో అజిత్ విశ్వాసం.. శివ‌కార్తికేయ‌న్ 13వ‌ సినిమాల‌తో బిజీగా ఉంది న‌య‌న్. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ తో పాటు మ‌రోవైపు హీరోల‌తోనూ న‌టిస్తూ బ్యాలెన్స్ చేస్తుంది ఈ భామ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here