నారా బాబుగా రానా బాబు.. అబ్బో అరిపించాడుగా..

రోమ్ లో ఉన్న‌పుడు రోమ‌న్ లా ఉండాలంటారు. ఇప్పుడు రానాను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈయ‌న ఏ పాత్ర‌లో దూరితే అందులో పూర్తిగా ఒదిగిపోతుంటాడు. ఇప్పుడు ఈయ‌న చంద్ర‌బాబునాయుడుగా మారిపోయాడు. ఈయ‌న లుక్ చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు.

Nara-Chandrababu-Naidu-From-NTR-Biopic

తాజాగా రానా బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఓ పిక్ చూసి అంతా పిచ్చెక్కిపోతున్నారు. అస‌లు రానా ఏంటి ఇంత‌గా ఎలా మేకోవ‌ర్ అయ్యాడు అని. ఇప్ప‌టికే ఈ చిత్రంలో త‌న పార్ట్ పూర్తి చేసాడు రానా. ఇందులో చంద్ర‌బాబుకు సంబంధించిన స‌న్నివేశాలు సినిమాలో కీల‌కంగా ఉంటాయ‌ని తెలుస్తుంది. ఇదే సినిమాను మ‌లుపుతిప్పే విధంగా ఉంటాయ‌ని.. వీటిపై క్రిష్ కూడా చాలా జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఇప్పుడు రానా జోరు కూడా మామూలుగా లేదు. ఈయ‌న చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే ఇప్పుడు. ఎందుకంటే ఒక్క భాష‌తో స‌రి పెట్టుకోవ‌డం లేదు ఈ హీరో.

వ‌ర‌స‌గా అన్ని భాష‌ల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ న‌టిస్తున్నాడు రానా. ప్ర‌స్తుతం ఈయ‌న‌ ద్విభాషా చిత్రం అరణ్య షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం త‌ర్వాత మ‌రో మూడు సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టించ‌డానికి ఒప్పుకున్నాడు ఈ హీరో.

ఇందులో నారా చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లో రానా న‌టిస్తున్నాడు. ఇది చిన్న పాత్ర కాద‌ని అంద‌రికీ తెలుసు. ద‌ర్శ‌కుడు క్రిష్ తో ఉన్న అనుబంధంతో ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్నాడు రానా. ఎన్టీఆర్ జీవితంలో చంద్ర‌బాబు పాత్ర కీల‌క‌మైంది. అందుకే ఈ పాత్ర కోసం త‌న‌ను తాను మార్చుకుంటున్నాడు ద‌గ్గుపాటి వార‌సుడు. ఎలా ఉండాలో ఇప్ప‌ట్నుంచే ఆ పాత్ర‌ను ఆక‌ళింపు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా క్రిష్ ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పాత్ర వివ‌రాల‌ను అడిగి తెలుసుకుంటున్నాడు క్రిష్‌. మొత్తానికి లుక్ అయితే అదిరింది.. యాక్టింగ్ కూడా అదురుతుంద‌నే అంతా ఊహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here