96 రీమేక్ పై క్లారిటీ వ‌చ్చింది.. నాని కూడా..

నాని ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఫ్రీ అయిపోయాడు. ఈయ‌న లాస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి చేసాడు. అయితే ఇప్పుడు ఈయ‌న ఫ్యూచ‌ర్ సినిమాల‌పై మాత్రం లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి ప్రేక్ష‌కుల‌కు. ముఖ్యంగా ఇప్పుడు ఈయ‌న ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే జెర్సీకి క‌మిట‌య్యాడు. ఈ చిత్రం ద‌స‌రాకు ప‌ట్టాలెక్క‌నుంది. ఇక ఈ చిత్రంతో పాటు చంద్ర‌శేఖ‌ర్ యేలేటితోనూ ఓ సినిమాకు నాని సై అన్నాడ‌నే వార్త‌లు ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో 96 రీమేక్ లో నాని న‌టిస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత‌. అక్క‌డ అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

nani-96-movie
విడుద‌ల‌కు ముందే ఈ చిత్రం చూసిన రాజు.. ఇక్క‌డ రీమేక్ చేయాల‌ని చూస్తున్నాడు. అది కూడా నానితో.. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈ చిత్ర రీమేక్ లో నాని న‌టించ‌డం లేద‌ని.. కేవ‌ల నిర్మాతగా ఉంటాడ‌ని తెలుస్తుంది. అ.. సినిమాతో నిర్మాత‌గా మారిన న్యాచుర‌ల్ స్టార్.. ఇప్పుడు 96 రీమేక్ ను దిల్ రాజుతో క‌లిసి నిర్మిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై త్వ‌ర‌లోనే పూర్తి క్లారిటీ రానుంది. విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన ఈ చిత్రం మిడిల్ ఏజ్ క‌థ‌. 35 ఏళ్ల వ‌య‌సు పాత్ర‌లో న‌టించ‌డం నానికి ఇప్పుడు ఇష్టం లేద‌ని.. లేనిపోని రిస్క్ ఎందుక‌ని వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తుంది. అయితే చివ‌రి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు.. నిజంగానే క‌థ బాగుంటే నాని న‌టించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here