నాని సినిమాలో ఆ ఐదుగురు ఎవ‌రు..?

నాని కొత్త సినిమా విక్ర‌మ్ కే కుమార్ తో అని ప్ర‌క‌టించాడు అయితే దాంతోపాటే మ‌రో స‌స్పెన్స్ కూడా ఇచ్చాడు. ఆ పజిల్ పేరు ఆ ఐదుగురు. ఇంత‌కీ సినిమా కోసం ప‌ని చేస్తున్న ఆ ఐదుగురు ఎవ‌రు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఛాన్స్ ఉంది. అయితే ఐదుగురు అమ్మాయిలు కూడా ఉంటార‌ని తెలుస్తుంది. మ‌రోవైపు నాని, విక్ర‌మ్ కే కుమార్, పిసి శ్రీ‌రామ్ ముగ్గురు అయిపోయారు. ఇక ఏఆర్ రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నానే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. నాని ఇప్పుడు జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా స‌గానికి పైగా పూర్త‌యింది. ఫిబ్ర‌వ‌రి నాటికి షూటింగ్ పూర్తి కానుంది. కృష్ణార్జున యుద్ధం.. దేవ‌దాస్ తేడా కొట్టే స‌రికి ఈ హీరోలో ఎక్క‌డ‌లేని మార్పు వ‌చ్చేసింది ఇప్పుడు. అందుకే క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడు.

nani vikram
nani vikram

కొత్త క‌థ‌లు అయితేనే ఓకే అంటున్నాడు కానీ ఇప్పుడు రిస్క్ తీసుకోడానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు నాని. ఒక‌ప్పుడు నాని సినిమా ఎలా ఉండేదో అలా చూపించాలని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు నానిని కాపాడుతుంది కూడా. జెర్సీ త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నా కూడా కాద‌ని విక్ర‌మ్ కే కుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 19న మొద‌లు కానుంది. అంద‌ర్నీ కాద‌ని విక్ర‌మ్ కే కుమార్ ను తీసుకుని రావ‌డానికి కూడా కార‌ణం ఉంది. విక్ర‌మ్ సినిమా అంటే డిఫెరెంట్ గా ఉంటుంద‌ని ప్రేక్ష‌కుల్లో న‌మ్మ‌కం ఉంది. ఆయ‌న చేసిన మ‌నం కానీ.. హ‌లో కానీ.. ఇష్క్ కానీ.. 24 కానీ.. ఏ సినిమాకు అదే భిన్నం. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్లు ఫ్లాపులు ప‌క్క‌న‌బెడితే విక్ర‌మ్ సినిమా అంటే భిన్నం అని అర్థం. అందుకే ఆయ‌న‌తో సినిమా కోసం స్టార్ హీరోలు కూడా పోటీలో ఉంటారు. మొన్న‌టి వ‌ర‌కు బ‌న్నీ కూడా విక్ర‌మ్ సినిమాకు ఓకే చెప్పాడు కానీ అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు నాని లైన్ లోకి వ‌చ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here