నాని డ‌బ్బులు తీసుకోవ‌డం లేదంట‌..

క‌ల‌లు అంద‌రూ కంటారు. కానీ దాన్ని నిజం మాత్రం కొంద‌రే చేసుకుంటారు. నిద్ర పోతున్న‌పుడు క‌ల దానంత‌టే అదే వ‌స్తుంది. కానీ అది నిజం కావాలంటే నిద్రలోంచి లేచి బ‌య‌టికి వ‌చ్చి క‌ష్ట‌ప‌డాలి. అది చాలా త‌క్కువ మంది చేస్తారు. అందులో నాని కూడా ఒక‌రు. ఈయ‌న ఎక్క‌డి నుంచి మొద‌లై.. ఇప్పుడు ఎక్క‌డి వ‌ర‌కు ఎదిగాడో.. ఆయ‌న జ‌ర్నీ త‌లుచుకుంటుంటేనే చాలా ఇన్స్ స్పైరింగ్ గా ఉంటుంది. మూడేళ్ల కింది వ‌ర‌కు నాని ఒక్కో సినిమాకు కోటి కూడా తీసుకునేవాడో కాదో మ‌రి.. కానీ ఇప్పుడు ఆయ‌న రేంజ్ చూసి స్టార్ హీరోలు కూడా కుళ్లుకోవాల్సిన ప‌రిస్థితి. ఈ ఏడాది కాస్త జోరు త‌గ్గించాడు నాని.
nani
కృష్ణార్జున యుద్ధంతో పాటు దేవ‌దాస్ కూడా ఫ్లాప్ అయింది. దాంతో కాస్త వెన‌క‌బ‌డ్డాడు అయితే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం నాని వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. నేను లోక‌ల్ ముందు వ‌ర‌కు కూడా 3 కోట్ల లోపు ఉన్న నాని రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు డ‌బుల్ అయింది.నేనులోక‌ల్ త‌ర్వాత నిన్నుకోరి కోసం 4 కోట్ల‌పైనే తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. కృష్ణార్జున యుద్ధంకు రైట్స్ తో పాటు లెక్క 8 కోట్ల‌కు చేరింది. దాంతోపాటు దేవ‌దాస్ కు కూడా భారీ రెమ్యునరేష‌న్ తీసుకున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి.
ఇక ఇప్పుడు ఈయ‌న రెమ్యున‌రేష‌న్ కు బ‌దులుగా రైట్స్ తీసుకోవ‌డం అల‌వాటు చేసుకుంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఈయ‌న ఇప్పుడు న‌టిస్తున్న జెర్సీ భారీ బ‌డ్జెట్ ఉండ‌టంతో త‌న పారితోషికం బ‌దులుగా రైట్స్ తీసుకుంటాన‌ని చెబుతున్నాడు నాని. ముందు క‌థ‌కు కావాల్సినంత బ‌డ్జెట్ ఇచ్చి ఆ త‌ర్వాత తాను లాభాల్లో వాటా తీసుకుంటానంటున్నాడు. ఈ చిత్రం 80ల నేపథ్యంలో తెర‌కెక్కుతుంది. అప్పుడు క్రికెట్ టీంలో రావాలనుకునే ఓ ఆట‌గాడి క‌థ ఇది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు నాని. మ‌రి ఈయ‌న రెమ్యున‌రేష‌న్ క‌హానీ ఏంటో త్వ‌ర‌లోనే తేల‌నుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here