నానిలో చాలా గ‌ట్టి మార్పే వ‌చ్చింద‌బ్బా..

నాని సినిమా అంటే ఏడాది కింది టాక్ తెలుసుకోకుండానే హిట్ అనేవాళ్లు కానీ ఇప్పుడు టాక్ బాగున్నా కూడా ఫ్లాప్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డ్డాడు న్యాచుర‌ల్ స్టార్. త‌న‌ను మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించే క‌థ కోసం.. ద‌ర్శ‌కుడి కోసం చూస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న జెర్సీ సినిమాలో న‌టిస్తున్నాడు. క‌ల‌లు అంద‌రూ కంటారు. కానీ దాన్ని నిజం మాత్రం కొంద‌రే చేసుకుంటారు. నిద్ర పోతున్న‌పుడు క‌ల దానంత‌టే అదే వ‌స్తుంది.

Actor Nani Devadas Interview Stills (1)

కానీ అది నిజం కావాలంటే నిద్రలోంచి లేచి బ‌య‌టికి వ‌చ్చి క‌ష్ట‌ప‌డాలి. అది చాలా త‌క్కువ మంది చేస్తారు. అందులో నాని కూడా ఒక‌రు. ఈయ‌న ఎక్క‌డి నుంచి మొద‌లై.. ఇప్పుడు ఎక్క‌డి వ‌ర‌కు ఎదిగాడో.. ఆయ‌న జ‌ర్నీ త‌లుచుకుంటుంటేనే చాలా ఇన్స్ స్పైరింగ్ గా ఉంటుంది. అచ్చు ఇలాంటి క‌థ‌తోనే ఇప్పుడు జెర్సీ కూడా వ‌స్తుంది. ఇందులో కూడా ఇండియ‌న్ క్రికెట్ టీంలోకి ఎలాగైనా రావాల‌నుకునే క‌సి ఉన్న ఓ కుర్రాడి క‌థ ఇది. గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది.

nani jersey
nani jersey

వ‌చ్చే ఏడాది ఎప్రిల్ 19న విడుద‌ల కానుంది జెర్సీ. ఇదిలా ఉంటే ఈ చిత్రం త‌ర్వాత మ‌రోసారి కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడు నాని. కిషోర్ అనే కుర్ర ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఓకే అని చెప్పాడు నాని. అయితే ఈ క‌థ రైతు నేప‌థ్యంలో సాగ‌నుంది. అంతేకాదు.. మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి క‌థ‌కు ద‌గ్గ‌రి పోలిక ఉండ‌టంతో ఆ క‌థ‌లో కొన్ని మార్పులు చేసి తీసుకుని రావాల్సిందిగా ద‌ర్శ‌కుడికి నాని సూచించిన‌ట్లు తెలుస్తుంది.

ఇక ఇప్పుడు సినిమాల విష‌యంలోనే కాదు రెమ్యున‌రేష‌న్ విషయంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు నాని. జెర్సీకి పారితోషికం కంటే కూడా లాభాల్లో వాటా తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. అలా చేస్తే నిర్మాత‌ల‌కు కూడా లాభాలు వ‌స్తాయి. గౌత‌మ్ తిన్న‌నూరి.. కిషోర్ త‌ర్వాత‌ విక్ర‌మ్ కే కుమార్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు నాని. మొత్తానికి క‌థ కొత్త‌గా ఉంటే త‌ప్ప అటు వైపు కూడా వెళ్ల‌డం లేదు నాని. అంతేమ‌రి రెండు ఫ్లాపులు వ‌స్తే కానీ ఈ విష‌యం అర్థం కాలేదు న్యాచుర‌ల్ స్టార్ కు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here