క‌ళ్యాణ్ రామ్ గూడ‌చారి 118..

ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ ఇదే అయిపోయాడు. పాపం ఏ సినిమా చేసినా.. ఎలాంటి సినిమా చేసినా ఫ‌లితం మాత్రం ఫ్లాప్ అని వ‌స్తుంటే ఏ హీరోకైనా ఫ్ర‌ష్టేష‌న్ త‌ప్ప‌దు. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న కొన్నేళ్లుగా వ‌ర‌స ప్లాపుల్లో ఉన్నాడు. 2015లో ప‌టాస్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న క‌ళ్యాణ్.. ఆ త‌ర్వాత మాత్రం వ‌ర‌స డిజాస్ట‌ర్లు ఇస్తున్నాడు. షేర్ సినిమా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో కూడా తెలియ‌దు.

ఇక యిజం అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ కూడా త‌న వంతుగా క‌ళ్యాణ్ కు ఓ ప్లాప్ ఇచ్చాడు. నిజానికి ఇది క‌ళ్యాణ్ రామ్ ఇమేజ్ కు భిన్నంగా వ‌చ్చిన సినిమా. ఇక దానిత‌ర్వాత చేసిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా అవు తుంద‌ని చేసిన ఎమ్మెల్యే సైతం ఫ్లాప్ అయింది. ఇక మొన్నొచ్చిన నా నువ్వే అయితే డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్ అయిపోయింది. తొలిరోజే ఈ చిత్రాన్ని ఔట్ రేటెడ్ గా రిజ‌క్ట్ చేసారు ప్రేక్ష‌కులు.

ఇప్పుడు ఈయ‌న మ‌హేష్ కోనేరు నిర్మాణంలోనే సినిమాటోగ్ర‌ఫ‌ర్ గుహ‌న్ ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి 118 అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ పాత్ర కొత్త‌గా ఉంటుందంటున్నాడు ద‌ర్శ‌కుడు. ఆయ‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగానే ఈ టైటిల్ సెట్ చేసామంటున్నారు. ఇందులో గూడ‌చారి త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. నివేదా థామ‌స్, శాలిని పాండే హీరోయిన్లు. ఈ చిత్రంతో క‌చ్చితంగా మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతాన‌నే న‌మ్మ‌కంతోనే ఉన్నాడు ఈ హీరో.

Nandamuri Kalyan Ram 118 movi title logo
Nandamuri Kalyan Ram 118 movi title logo

అయితే ధైర్యంగా మాత్రం అదే మాట చెప్ప‌లేక‌పోతున్నాడు. పాపం కొన్నిసార్లు మంచి క‌థ‌లు కూడా అలా వ‌చ్చి వెళ్తుంటాయి. అందుకే క‌ళ్యాణ్ రామ్ ఈ సారి మాట‌ల‌తో కాదు చేత‌ల‌తో చేయాల‌నుకుంటున్నాడు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో నాన్న హ‌రికృష్ణ పాత్ర‌లో న‌టిస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. మ‌రి చూడాలిక‌.. ఈ రెండు సినిమ‌ల్లో ఏది క‌ళ్యాణ్ రామ్ కు హిట్ తీసుకొస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here