ఫ్యామిలీతో మాయ‌మైపోతున్న నాగార్జున‌..

అవును.. ఇప్పుడు నాగార్జున ఇదే చేస్తున్నాడు. ఈయ‌న మ‌రో నెల రోజుల పాటు ఎవ‌రికీ క‌నిపించ‌డు. కొన్ని రోజులుగా వ‌ర‌స‌గా షూటింగ్ ల‌తో అలిసిపోయిన ఈయ‌న ఇప్పుడు హాయిగా ఫ్యామిలీ టూర్ వెళ్లిపోతున్నాడు. ఇదే విష‌యాన్ని ట్వీట్ కూడా చేసాడు ఈ హీరో. నిన్న‌టి వ‌ర‌కు దేవ‌దాస్ టెన్ష‌న్ లో ఉన్న నాగార్జున‌.. ఇప్పుడు అది కూడా వ‌దిలేసాడు. ఈ సినిమా షో చూసిన త‌ర్వాత హాయిగా దేశం వ‌దిలేస్తున్నాడు. కుటుంబంతో క‌లిసి సినిమా చూసిన నాగ్.. నా చేతిలో హిట్ మాల్ ఉంది అంటున్నాడు.

NAGARJUNA FAMILY TOUR

ఇదే విష‌యాన్ని అభిమానుల‌కు కూడా చెప్పాడు. అందుకే ప్ర‌శాంతంగా వెళ్తున్నానంటూ ట్వీట్ చేసాడు ఈ హీరో. ఈయ‌న తీరు చూస్తుంటే ఇప్ప‌ట్లో మ‌ళ్లీ వ‌చ్చేలా కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే కొన్ని రోజులుగా బ్ర‌హ్మాస్త్ర‌.. దేవ‌దాస్ తో పాటు మ‌రికొన్ని ప‌ర్స‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తోనూ బిజీగా ఉన్నాడు నాగార్జున‌. అందుకే రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నాడు. వ‌చ్చిన త‌ర్వాత రెండు సినిమాల‌తో బిజీ కానున్నాడు ఈ హీరో. ఒక‌టి రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అయితే.. మ‌రోటి ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో. ఈ రెండు సినిమాల‌తోనే మ‌రో ఆర్నెళ్ల పాటు బిజీ కానున్నాడు నాగార్జున‌. మ‌రి మ‌ళ్లీ ఈయ‌న మ‌ళ్లీ ఎప్పుడు తిరిగొస్తాడో..? వ‌చ్చి ఎప్పుడు షూటింగ్స్ చేస్తాడో చూడాలిక‌..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here