బాల‌య్య‌ను నాగ‌బాబు మ‌ళ్లీ టార్గెట్ చేస్తున్నాడుగా..

నాగబాబు ఒకప్పట్లా లేడు. ఇప్పుడు ఆయన చాలా మారిపోయాడు. కావాలనే వివాదాలను కోరి మరీ తెచ్చుకుంటున్నాడు మెగా బ్రదర్. లేకపోతే మరేంటి.. బాలయ్యతో ఆల్ రెడీ అయిపోయింది అనుకుంటున్న గొడవ మళ్ళీ రేపుతున్నాడు మెగా సోదరుడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటూ సంచలన సమాధానం చెప్పిన నాగబాబు.. ఇప్పుడు మళ్లీ అలాంటి పని ఒకటి చేశాడు.

Naga Babu Trolls Balayya Again

తన ఫేస్ బుక్ లో ఓ కుర్రాడి వీడియో పోస్ట్ చేశాడు. తను వీడియో పోస్ట్ చేయడం పెద్ద విషయం కాదు.. కానీ ఆ వీడియోలో ఏముంది అనేది అక్కడ పెద్ద విషయం. ఎందుకంటే బాలయ్యని టార్గెట్ చేస్తూ నాగబాబు ఈ వీడియో పోస్ట్ చేశాడు అనే వార్త‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా.. ఓ బుడ్డోడు సారే జహసే అచ్చా అంటూ పాడుతున్నాడు. ఆ మధ్య తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలయ్య సారే జహాసే అచ్చా అనడంలో తడ‌బడి బుల్ బుల్ అన్నాడు. ఇప్పుడు దానికి కౌంటర్ గానే నాగబాబు ఈ వీడియో పోస్ట్ చేశారు అని ఫ్యాన్స్ ఆయన పై కోపంగా ఉన్నారు.

అయిపోయిన గొడవను మళ్లీ ఎందుకు రేపుతున్నాడు అంటూ మెగా బ్రదర్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు నందమూరి అభిమానులు. మరి దీనికి నాగబాబు ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి. ఓవైపు చిరంజీవి తనకు మంచి స్నేహితుడని బాల‌య్య చెబుతుంటే నాగబాబు మాత్రం బాలయ్యను మళ్లీ మళ్లీ టార్గెట్ చేస్తుండటం ఇరు కుటుంబాల అభిమానులను టెన్షన్ పెడుతోంది. మరి ఈ గొడవ ఎక్కడ ఆగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here