బాబోయ్ నాగ‌బాబుకు ఇంత ధైర్యం ఎక్క‌డిది..?

మెగా బ్ర‌ద‌ర్స్ లో కాస్త గ‌మ‌నిస్తే కామ్ గా ఉండేది చిరంజీవి.. ఆ త‌ర్వాత నాగ‌బాబు. ఎక్కువ‌గా బ‌య‌ట మాట్లాడ‌డు.. అవ‌స‌రం వ‌చ్చిన‌పుడు మాత్రం స్పందిస్తుంటాడు అనే పేరుంది. కానీ ఇప్పుడు ఈయ‌న త‌న ఇమేజ్ కు పూర్తి భిన్నంగా వెళ్లిపోయాడు. తెలుగు మీడియాతో పాటు అంద‌ర్నీ ఏకి పారేసాడు.

Naga Babu shocking comments on Balakrishna
Naga Babu shocking comments on Balakrishna

ఇంత‌గా కోపం ఉందా ఈయ‌న‌లో అనుకునేలా రెచ్చిపోయాడు. బాల‌య్య ఎవ‌రో తెలియ‌దు అనే ద‌గ్గ‌ర్నుంచి మీడియా పెద్ద‌లంతా డ‌బ్బు కోస‌మే ప‌ని చేస్తున్నారు.. జ‌ర్న‌లిస్టుల‌ను తొక్కేస్తున్నారు.. వాళ్ల భావాల‌ను కాల‌రాజేస్తున్నారు అంటూ చాలా పెద్ద డైలాగులు వాడేసాడు నాగ‌బాబు. జ‌న‌సేన కోసం తాను శ్రామికుడిగా క‌ష్ట‌ప‌డ‌తాను కానీ ఎమ్మెల్యేగా మాత్రం పోటీ చేయ‌న‌ని చెప్పాడు ఈ న‌టుడు. ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భుకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు నాగ‌బాబు.

ఒక‌ప్పుడు త‌న అప్పుల నుంచి మొద‌లుపెట్టి.. ఇప్పుడు కొడుకు సంపాదిస్తున్న కోట్ల వ‌ర‌కు అన్నీ చెప్పాడు మెగా బ్ర‌ద‌ర్. ముఖ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ అంటే ఎవ‌రో తెలియ‌దు అని చెప్ప‌డం కొస‌మెరుపు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిఎం అవుతాడు రాసి పెట్టుకోండి అంటూ జ్యోతిష్యం కూడా చెప్పాడు ఈ న‌టుడు.

ప‌నిలో ప‌నిగా త‌మ్ముడు పెళ్లిళ్ల గురించి కూడా చెప్పాడు నాగ‌బాబు. మొద‌టి ముగ్గురులో ఇద్ద‌రు త‌మ కుటుంబంతో అస్స‌లు ప‌డ‌లేద‌ని.. వాళ్ళు విడిపోయిన‌పుడు కూడా తాము పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే వాద‌న వ‌చ్చేలా మాట్లాడాడు నాగ‌బాబు. ఇప్పుడు ఉన్న అమ్మాయి చాలా అనుకువ‌గా ఉంద‌ని.. త‌మ కుటుంబంతో క‌లిసింద‌ని చెప్పాడు మెగా సోద‌రుడు. మొత్తానికిప్పుడు నాగ‌బాబు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంచ‌ల‌నం అయిపోయింది.

FULL INTERVIEW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here