థ‌మ‌న్ ఏం చేస్తున్నాడ‌బ్బా.. ఏదో మాయ‌లా ఉంది..

టైమ్ అంటే ఇలాగే ట‌ర్న్ అవ్వాలి మ‌రి. మొన్న‌టి వ‌ర‌కు రొటీన్ మ్యూజిక్ ఇస్తాడ‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న థ‌మ‌న్ ఇప్పుడు వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ ర‌ప్ఫాడిస్తున్నాడు. అస‌లు ఖాళీ అనేది లేకుండా కుమ్మేస్తున్నాడు. ఇప్పుడు అర‌వింద స‌మేత కూడా సూప‌ర్ హిట్ కావ‌డంతో మ‌నోడి క్రేజ్ మ‌ళ్లీ పెరిగిపోయింది. పైగా ఈ చిత్రంలో పాట‌లు బాగోలేక‌పోయినా కూడా ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. దాంతో ఇప్పుడు థ‌మ‌న్ కోసం మ‌ళ్లీ స్టార్ హీరోలు క్యూ క‌డుతున్నారు.

ss thaman

పైగా ఇప్పుడు చేతినిండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు థ‌మ‌న్. ప్ర‌స్తుతం అఖిల్ తో పాటు ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాకు కూడా ప‌ని చేస్తున్నాడు. ఇద్ద‌రితోనూ గ‌తంలో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది ఈ సంగీత ద‌ర్శ‌కుడికి. ఇప్ప‌టికే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ షూటింగ్ పూర్తైపోయింది. దాంతో పాటు మ‌రో అర‌జ‌డ‌న్ సినిమాలు కూడా థ‌మ‌న్ చేతిలో ఉన్నాయి. అన్నింటికీ మించి ఇప్పుడు జ‌న‌సేనా క‌వాతు సాంగ్ కు కూడా ఈయ‌నే ట్యూన్ ఇచ్చాడు. ప‌ద ప‌ద ప‌దా అంటూ ఈ పాట ఇప్పుడు వైర‌ల్ అయిపోయింది. మొత్తానికి ఏం మాయ చేస్తున్నాడో తెలియ‌దు కానీ వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు ఈ కుర్ర సంగీత ద‌ర్శ‌కుడు. రొటీన్ అనే ముద్ర‌తోనే ర‌ప్ఫాడిస్తున్నాడు. ఇక ఈయ‌న గానీ ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడంటే నా సామిరంగా.. ఇక థ‌మ‌న్ ను ప‌ట్టుకోవ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here