జ‌న‌వ‌రిలో ఎలా అఖిల్.. గుంపులో గోవిందా..

అస‌లే రెండు వ‌ర‌స ఫ్లాపుల‌తో కెరీర్ లో ఎటూ కాకుండా ఉన్నాడు అఖిల్. హ‌లో త‌ర్వాత ఆర్నెళ్లు గ్యాప్ తీసుకుని వెంకీ సినిమా మొద‌లుపెట్టాడు ఈ కుర్ర హీరో. మిస్ట‌ర్ మ‌జ్ను షూటింగ్ అనుక‌న్న దానికంటే వేగంగానే జ‌రుగుతుంది. అయితే విడుద‌ల మాత్రం అనుకున్న‌ట్లుగా డిసెంబ‌ర్ లో కావ‌డం లేదు.

mrmajunu

ముందు నుంచి ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 21న అనుకున్నా కూడా కుద‌ర్లేదు. పైగా అదే నెల్లో వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షంతో పాటు శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచే మ‌న‌సు కూడా విడుద‌ల కానుంది. దాంతో మ‌నోడు ఏకంగా వ‌చ్చే ఏడాదికి త‌న సినిమా వాయిదా వేసుకున్నాడు. మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాపై అప్ డేట్ కూడా ఇచ్చాడు ఈ హీరో. డిసెంబ‌ర్ 3లోపు మిగిలిన ఒక్క పాట‌ను కూడా పూర్తి చేస్తామ‌ని చెప్పాడు అఖిల్. జ‌న‌వ‌రిలో సినిమా విడుద‌ల‌వ‌తుంద‌ని చెప్పాడు ఈ హీరో.

అక్క‌డ కూడా ముందు తొలిప్రేమ‌ను విడుద‌ల చేసిన ఫిబ్ర‌వ‌రిలోనే త‌న సినిమాను మ‌రోసారి విడుద‌ల చేయాల‌ని అనుకున్నాడు వెంకీ అట్లూరి. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా మ‌న‌సు మార్చుకుని జ‌న‌వ‌రిలో మిస్ట‌ర్ మ‌జ్ను ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌ని పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పుడు మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్ చేసాడు అఖిల్. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది ఈ చిత్రం. చిన్న బ్రేక్ తీసుకుని మిగిలింది కూడా పూర్తి చేయ‌నున్నారు. స‌వ్య‌సాచి ఫేమ్ నిధి అగ‌ర్వాల్ ఇందులో అఖిల్ తో జోడీ క‌ట్టింది. ఇప్ప‌టికే జ‌న‌వ‌రిలో చాలా సినిమాలు వ‌స్తున్నాయి ఇప్పుడు వాటికి తోడుగా అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్ను కూడా వ‌స్తుంది. మ‌రి వీట‌న్నింటికీ ఎక్క‌డ థియేట‌ర్స్ స‌రిపోతాయి అనేది చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here