మ‌ణిశ‌ర్మ త‌ప్పేంటి.. దేవ‌దాస్ లో కుమ్మేసాడు..

మ‌ణిశ‌ర్మ మ‌ళ్లీ మాయ చేసాడు. త‌న‌కు అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి ఇంకా త‌న‌లో స‌త్తా అయిపోలేద‌ని నిరూపించుకుంటూనే ఉన్నాడు ఈయ‌న‌. ఇప్పుడు కూడా దేవ‌దాస్ లో అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చాడు. పాట‌లు కూడా బాగున్నాయి. ఇప్పుడంటే దేవీ శ్రీ ప్ర‌సాద్.. థ‌మ‌న్.. అనిరుధ్.. ఇప్పుడంటే వీళ్లొచ్చారు కానీ కాలం ఒక్క ప‌దేళ్లు వెన‌క్కి తిప్పితే అప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ణిశ‌ర్మ అనే పేరు త‌ప్ప మ‌రోటి వినిపించేదే కాదు.

MANISHARMA

ప‌దేళ్ల టైమ్ లోనే 100 సినిమాల‌కు పైగా మ్యూజిక్ ఇచ్చాడు మ‌ణి. ఎన్నో సినిమాల‌ను త‌న మ్యూజిక్ తో నిల‌బెట్టిన మ‌ణి.. ఈ మ‌ధ్య పూర్వ‌పు ఫామ్ చూపించలేక‌పోయాడు. 2012లో వ‌చ్చిన ర‌చ్చ త‌ర్వాత మ‌ణిశ‌ర్మ కెరీర్ లో మ‌రో హిట్ లేదు. మ‌రోవైపు మ్యూజిక్ లో కూడా గ‌త స్థాయి క‌నిపించ‌లేదు.

దాంతో మ‌ణిశ‌ర్మ కెరీర్ ఇక పూర్తైపోయిన‌ట్లే అనుకున్నారంతా. త‌న‌లో ఇంకా ప‌స త‌గ్గ‌లేద‌ని రెండేళ్ల కింద వ‌చ్చిన‌ జెంటిల్ మ‌న్ తో నిరూపించాడు మ‌ణిశ‌ర్మ‌. ఆ సినిమాలో త‌న బ్యాగ్రౌండ్ స్కోర్ తో కేక పెట్టిం చాడు మ‌ణి. చాలా స‌న్నివేశాలు కేవ‌లం మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ వ‌ల్లే హైలైట్ అయ్యాయంటే అతిశ‌యోక్తి కాదు. వీటితో పాటు లై.. ఒక్క‌క్ష‌ణం.. అమీతుమీ.. ఇలా చాలా సినిమాల‌కు ఈ మ‌ధ్య సంగీతం అందించాడు. ఇక ఇప్పుడు విడుద‌లైన దేవ‌దాస్ కూడా అదిరిపోయింది. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఇంత పెద్ద సినిమాకు ప‌ని చేసిన త‌ర్వాత కూడా మ‌ణిశ‌ర్మ‌కు ఆఫ‌ర్లు ఇవ్వ‌క‌పోతే అది క‌చ్చితంగా ఆయ‌న్ని త‌క్కువ చేసిన‌ట్లే అవుతుంది. మ‌రి చూడాలిక‌.. ఇప్ప‌ట్నుంచైనా ఈయ‌న మ‌ళ్లీ బిజీ అవుతాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here