మెరుపుతీగ‌లా మారిపోయిన మెహ్రీన్..

అమ్మాయిలు మారిపోవ‌డానికి ఎంతో టైమ్ ప‌ట్ట‌దు. ఫిజిక‌ల్ గా వాళ్లు చాలా త‌క్కువ టైమ్ లోనే మారిపోతుంటారు. ఇప్పుడు మెహ్రీన్ కూడా ఇదే చేసింది. మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ముద్దుగా మారిపోయింది. మెరుపుతీగ‌లా స‌న్న‌గా మారిపోయి న‌వ్వుతోనే ప్రాణాలు తీస్తుంది. ప్ర‌స్తుతం నోటా ప్ర‌మోష‌న్ తో బిజీగా ఉంది ఈ భామ‌. ఇందులోనే అమ్మ‌డిని చూసి అంతా షాక్ అవుతున్నారు. విజ‌య్ తో క‌లిసి ఫోటోషూట్ కూడా చేసింది మెహ్రీన్.

MEHRENE

ఈ మ‌ధ్య సినిమాల విష‌యంలో కాస్త వెన‌క‌డుగు వేసిన మెహ్రీన్.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో దూకుడు మీదుంది. ఇప్ప‌టికే ఈ ఏడాది పంతంతో వ‌చ్చింది. కానీ ఈ సినిమా వ‌ర్క‌వుట్ కాలేదు. గోపీచంద్ తో పాటు మెహ్రీన్ కు కూడా ఈ సినిమా మ‌రో ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయినా కూడా ఇప్పుడు ఈమె జోరుకు బ్రేకులు అయితే ప‌డ‌టం లేదు.

సెన్సేష‌నల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో నోటా.. నితిన్-వెంకీ కుడుముల సినిమా.. వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాల్లో హీరోయిన్ గా న‌టిస్తుంది. దాంతో పాటే ఈ మ‌ధ్యే సుధీర్ బాబు కొత్త సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్సైంది మెహ్రీన్. పులివాసు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాతో పాటు ఇప్పుడు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఈమెకు వ‌చ్చింది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ తెర‌కెక్కిస్తున్న సినిమాలో మెహ్రీన్ ఓ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇప్పుడు షూటింగ్ లో కూడా అడుగు పెట్టింది. హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇందులో మెహ్రీన్ తో పాటు కాజ‌ల్ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది. నాలుగు సినిమాలు చేస్తున్నా కూడా ఇప్ప‌టికీ ఈమె కెరీర్ డేంజ‌ర్ లోనే ఉంది. ఇందులో ఏది హిట్టైనా కూడా మ‌ళ్లీ సేఫ్ జోన్ కు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఇలా వేచి చూడ‌టం త‌ప్ప ఇంకేం చేయ‌లేదు ఈ ముద్దుగుమ్మ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here