కుదిరిన మెగా కాంబినేష‌న్.. త్రివిక్ర‌మ్ తో చిరు క‌న్ఫ‌ర్మ్..

ఎన్నో ఏళ్లుగా మెగా అభిమానులు కలలు కంటున్న కాంబినేషన్ అది. ఇన్నాళ్లకు రామ్ చరణ్ సాక్షిగా అది ఓకే అయిపోయింది. రీ ఎంట్రీ లో వ‌ర‌స సినిమాల‌తో రెచ్చిపోతున్న చిరంజీవి.. ఇప్పుడు మరో సినిమాను కన్ఫర్మ్ చేశారు. అసలు ఈ దూకుడు చూస్తుంటే పదేళ్ల లోటును రెండు మూడు ఏళ్ల‌లోనే భర్తీ చేసేలా కనిపిస్తున్నారు మెగాస్టార్.

Megastar reveals his next movie with trivikram

ఇప్పటికే సైరా సినిమాలో నటిస్తున్న మెగాస్టార్.. ఆ తర్వాత కొరటాల శివను లైన్ లో పెట్టాడు. ఆయన అలా ఉండగానే బోయపాటి కూడా కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పాడు. ఈ రెండు సినిమాలు ఉండగానే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కూడా కన్ఫర్మ్ చేశాడు మెగాస్టార్. తనయుడి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయం బయట పెట్టాడు చిరంజీవి. ఎప్పటినుంచో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నాన‌ని.. ఇన్నాళ్లకు అది నెరవేరుతుందని క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి.

అప్పట్లో జై చిరంజీవ సినిమాకు కథ మాటలు అందించింది త్రివిక్రమే. అయితే త్రివిక్రమ్ దర్శకుడుగా బిజీ అయ్యే సమయానికి చిరంజీవి రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దాంతో తను చిరును డైరెక్ట్ చేసే అవకాశం కోల్పోయాడు మాటల మాంత్రికుడు. కానీ ఇప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు దొరికింది. 2020లో త్రివిక్రమ్-చిరు సినిమా పట్టాలెక్కనుంది. ఆ లోపు ఒప్పుకున్న సైరా, కొరటాల శివ సినిమాలు పూర్తి చేసుకుని రానున్నాడు మెగాస్టార్. చిరు- త్రివిక్రమ్ కాంబినేషన్ ను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. మరి మాటల మాంత్రికుడితో మెగాస్టార్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here