నిర్మాత డి శివ‌ప్ర‌సాద్ రెడ్డి మృతికి ఇండ‌స్ట్రీ సంతాపం..

ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి(62) అక్టోబ‌ర్ 27 ఉద‌యం 6.30 కి క‌న్ను మూసారు. కొన్ని రోజ‌లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతున్న ఆయ‌న ఆరోగ్య విష‌మించ‌డంతో మ‌ర‌ణించారు. ఆయ‌న మృతికి ఇండ‌స్ట్రీ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ముఖ హీరోలంద‌రితోనూ సినిమాలు నిర్మించారు శివ‌ప్ర‌సాద్ రెడ్డి. 1985లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి కార్తీక పౌర్ణ‌మి, శ్రావ‌ణ సంధ్య‌, విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్‌, సీతారామ‌రాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్‌, కింగ్, కేడీ, ర‌గ‌డ‌, ద‌ఢ‌, గ్రీకువీరుడు సినిమాల‌ను నిర్మించారు. ఇక ఈయ‌న మృతిపై చిరంజీవి కూడా స్పందించారు.

SIVA-PRASAD-REDDY-CHIRANJEEVI

మెగాస్టార్ తో అప్ప‌ట్లో ముఠామేస్త్రి సినిమా నిర్మించారు నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి. ఈయ‌న‌ మరణ వార్త తెలియగానే ఆయన కుమారుడు చందన్ తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రి’ చిత్రాన్ని నిర్మిచారు.ఆయన మంచి సాత్వికుడు, నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అన్నారు. ఇక అక్కినేని కుటుంబం అయితే షాక్ లో ఉంది. కామాక్షి మూవీస్ లో ఎక్కువ సినిమాలు నాగార్జునతోనే నిర్మించారు శివ‌ప్ర‌సాద్ రెడ్డి. ఈయ‌న అంత్య‌క్రియ‌లు అక్టోబ‌ర్ 28న జ‌రిగే అక‌వాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *