చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఒక‌రికి ఒక‌రు..

ఇప్పుడు ఈ ఫోటో చూస్తుంటే ఇదే అనిపిస్తుంది క‌దా. అన్నాద‌మ్ములు దూరంగా ఉన్న‌ట్లే ఉంటారు కానీ ఎప్పుడూ ద‌గ్గ‌ర‌గానే ఉంటారు. మాయ‌ల మ‌రాఠిలు ఈ మెగా హీరోలు. అదేంటి పుసుక్కున అంత మాట అనేసారు.. మెగా బ్ర‌ద‌ర్స్ మాయ‌ల మ‌రాఠి ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు వీళ్లు చేస్తోన్న ప‌నులు చూస్తుంటే ఇదే క‌రెక్ట్ టైటిల్. లేదంటే మ‌రేంటి.. ఎప్ప‌టికప్పుడు ఎవ‌రికి వారే అన్న‌ట్లుంటారు.

mega-brothers

కానీ అవ‌స‌రం ఉన్న‌పుడు అంతా ఒక్క‌టైపోతారు. మెగా కుటుంబంలో విభేధాలు ఉన్నాయ‌ని.. ప‌వ‌న్ తో అల్లు కుటుంబానికి ప‌డ‌టం లేద‌ని చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అంతా ఒక్క‌టైపోయారు. అవ‌స‌రం ఉన్న‌పుడు అన్ని బంధాలు బ‌య‌టికి వ‌చ్చాయి. తెగిపోయేట‌ప్పుడే దారం బ‌లం తెలుస్తుంది.. విడిపోయేట‌ప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు మెగా కుంటుంబానికి ఇప్పుడు ప‌క్కా సూట్ అవుతుంది. మొన్న‌టికి మొన్న చిరంజీవి ఇంట్లో జ‌రిగిన దివాళి పూజకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వ‌చ్చాడు ప‌వ‌ర్ స్టార్.

వ‌చ్చి అన్న ఆశీస్సుల‌తో పాటు అమ్మ లాంటి ఒదిన‌తో కూడా ఒద్దికగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయాల‌కు కూడా మెగా కుటుంబం అంతా అండ‌గా నిలబ‌డింది. ఆ మ‌ధ్య ఫిల్మ్ ఛాంబ‌ర్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన‌పుడు అంద‌రి కంటే ముందు అక్క‌డ తేలిన వ్య‌క్తి అల్లుఅర్జున్. ప‌వ‌న్ పిలిస్తే వ‌చ్చాడా లేదంటే నిజంగానే మ‌ద్ద‌తు తెల‌ప‌డానికి బాధ్య‌త‌గా వ‌చ్చాడా అనేది తెలియ‌దు కానీ.. వ‌చ్చీ రాగానే ప‌వ‌న్ ను ఆప్యాయంగా కౌగిలించుకోవ‌డం.. ప‌వ‌న్ కూడా బ‌న్నీని ద‌గ్గ‌రికి తీసుకోవ‌డం మాత్రం జ‌రిగింది. పైగా అల్లు అర‌వింద్ కూడా ప‌వ‌న్ ను ఒక్క మాట అన‌గానే బ‌య‌టికి వ‌చ్చి ప్రెస్ మీట్ లో ర‌చ్చ ర‌చ్చ చేసాడు. పైగా కేవ‌లం ప‌వ‌న్ మొహం చూసి మాత్ర‌మే ఇవ‌న్నీ భ‌రిస్తున్నాం అంటూ సింపుల్ గా వార్నింగ్ ఇచ్చాడు అల్లు అర‌వింద్. ఇక ఈ మ‌ధ్య అన్న‌య్య‌తోనే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. కొంప‌దీసి మెగాస్టార్ కానీ జ‌న‌సేన‌లోకి వ‌స్తున్నాడా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి ఇప్పుడు. మొత్తానికి మెగా బ్ర‌ద‌ర్స్ దూరంగా ఉన్నా అంతా ఒక్క‌టే అని మ‌రోసారి నిరూపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here