ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ వీర‌త్వం అదిరిపోయిందిగా.

మ‌ణిక‌ర్ణిక అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ అంటే మాత్రం తెలియ‌ని వాళ్లుండ‌రు. కాశీలో పుట్టి త‌న సాహ‌సాల‌తో దేశానికి వ‌న్నెతెచ్చిన వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్. ఈమె అస‌లు పేరు మ‌ణిక‌ర్ణిక‌. ఇప్పుడు ఈమె బ‌యోపిక్ రెడీ అయిపోతుంది. కంగ‌న ర‌నౌత్ హీరోయిన్ గా వ‌స్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయింది. అయితే కొన్ని విభేదాల వ‌ల్ల సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చేసాడు క్రిష్. కానీ ఇప్ప‌టికీ ఆయ‌న పేరు సినిమాలో క‌నిపిస్తుంది.

manikarnika

తాజాగా విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే సినిమా రేంజ్ క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. విజువ‌ల్ వండ‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు క్రిష్. ముఖ్యంగా వార్ సీన్స్ అద‌ర‌గొట్టాడు. కంగ‌న ర‌నౌత్ కూడా అద్భుతంగా వీర‌నారి పాత్ర‌లోకి వెళ్లిపోయింది. ఇప్ప‌టికే శాత‌క‌ర్ణి బ‌యోపిక్ చేసిన క్రిష్.. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నాడు. దీనికి ముందే ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ మ‌ణిక‌ర్ణిక బాధ్య‌త కూడా తీసుకున్నాడు. అయితే మ‌ధ్య‌లో కొన్నిసార్లు మాత్రం కంగ‌న రాజ‌కీయాల‌కి క్రిష్ బ‌లైపోతున్నాడు.

అందుకే ఈయ‌న కూడా ఈ సినిమా గురించి ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని పూర్తి చేసుకుని వ‌చ్చాన‌ని చెప్పుకుంటున్నాడు. మిగిలిన ప‌నుల‌న్నీ కావాల‌నే క్రిష్ ను ప‌క్క‌న‌బెట్టేసి కంగ‌న‌నే చేస్తూ పోతుంది. దానివల్ల సినిమాకు న‌ష్టం అని తెలిసినా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు కంగ‌న‌. తాను చేయాల్సిందంతా ఈ సినిమా కోసం చేసాడు క్రిష్. ఇప్పుడు కావాల‌నే వాళ్లే చెడ‌గొట్టుకుంటున్నారు. ఇప్ప‌టికే సోనూసూద్ కూడా సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చేసాడు. ఆయ‌న‌తో పాటు ఈ మ‌ధ్యే స్వాతి సెమ్ గ‌ల్ కూడా బ‌య‌టికి వ‌చ్చేసింది. మ‌రోవైపు ఈ చిత్రం జ‌న‌వ‌రి 2019, 25న వ‌స్తుందంటున్నాడు క్రిష్. ఈ రోజు టీజ‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసాడు. రి చూడాలిక‌.. చివ‌రి వ‌ర‌కు మ‌ణిక‌ర్ణిక విష‌యంలో ఇంకా ఎన్ని చిత్రాలు జ‌ర‌గ‌నున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here