హ‌రికృష్ణ‌ను మ‌ళ్లీ తీసుకొచ్చిన మ‌నోజ్ మంచు..

అదేంటి.. చ‌నిపోయిన మ‌నిషిని ఎలా తీసుకొస్తాడు.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఈ డిజిట‌ల్ యుగంలో ఏదైనా సాధ్య‌మే. ఇప్పుడు మంచు మ‌నోజ్ కూడా ఇదే చేసాడు. ఈయ‌న షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సంచ‌ల‌నం అయిపోయింది. సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అవుతుంది. మొన్న జ‌రిగిన ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ కు రామ్ చ‌ర‌ణ్ త‌ర‌ఫున ఆయ‌న తండ్రి చిరంజీవి వ‌చ్చాడు. ఇక ఎన్టీఆర్ త‌ర‌ఫున పెద్ద‌దిక్కుగా ఎవ‌రూ రాలేదు.

RRR

 

దాంతో మ‌నోజ్ ఓ ఫోటో షేర్ చేసాడు. త‌న‌కు వ‌చ్చిన వాటిలోనే ఇది ట్విట్ట‌ర్లో పెట్టాడు. ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ కు చిరుతో పాటు హ‌రికృష్ణ కూడా వ‌చ్చిన‌ట్లుగా సిజిలో సెట్ చేసారు. ఆ ఫోటోను ఇప్పుడు త‌ను షేర్ చేసాడు. ఆయ‌న ఉంటే బాగున్ను అంటూ రాసుకొచ్చాడు. నిజంగా మ‌నోజ్ చేసిన ఈ ప‌నికి నంద‌మూరి ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ కూడా బాగానే ఖుషీ అయ్యాడు. ఎందుకంటే ఎన్టీఆర్, మ‌నోజ్ ఒకేరోజు.. ఒకే ఏడాది పుట్టారు.

దాంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం కూడా ఎక్కువే. చిన్న‌నాటి నుంచి ఫ్రెండ్స్ ఇద్ద‌రూ. ఆ మ‌ధ్య హ‌రికృష్ణ పోయిన‌పుడు కూడా అన్నీ ఆయ‌నే అయి చూసుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు కొన్ని రోజులుగా సినిమాల‌కు దూరంగా ఉన్నా కూడా హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత మంచు మ‌నోజ్ ఎన్టీఆర్ కు మ‌రింత చేరువ‌య్యాడు. అప్పుడు మోహ‌న్ బాబు విదేశాల్లో ఉండి రాలేక‌పోయినా కూడా హ‌రికృష్ణ అంతిమ‌యాత్ర‌లో మ‌నోజ్ ఓ సాధార‌ణ ప్రేక్ష‌కుడిగా జూనియ‌ర్ ముందు న‌డిచారు.

బాడీగార్డ్ లా మారిపోయి.. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ వైపు ఎవ‌రూ రాకుండా చూసుకున్నాడు. ఈయ‌న తీరు చూసి అక్క‌డున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. హీరో అయ్యుండి.. మంచు వార‌సుడు అయ్యుండి అంత సింపుల్ గా ఎలా ఉన్నాడో అంటూ మ‌నోజ్ ను పొగిడారు. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌నే చేసి మ‌రోసారి నంద‌మూరి ఫ్యాన్స్ కు హీరో అయ్యాడు మ‌నోజ్ కుమార్ మంచు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here