మంచు ల‌క్ష్మితో ర‌కుల్ జిల్ జిల్ జిగా..

మంచు ల‌క్ష్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్. ఎందుకంటే ఇద్ద‌రూ స్టార్సే. ఇక ఈ ఇద్ద‌రూ ఇప్పుడు చేసిన ఓ ప‌ని.. పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్ లో సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు శ్రీ‌లంక‌లో ఉన్నారు. అక్క‌డ ర‌కుల్ బ‌ర్త్ డే సెలెబ్రేష‌న్స్ జ‌రుగుతున్నాయి.

ఒక‌టి రెండు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు త‌ను పుట్టిన‌రోజు పండ‌గ‌లు చేసుకుంటుంది ర‌కుల్. ఇందులో భాగంగానే ల‌క్ష్మితో క‌లిసి లంక టూర్ వెళ్లింది ర‌కుల్. వీళ్ళ‌తో పాటు నీర‌జ కోన కూడా ఉంది. అయితే మంచు ల‌క్ష్మి, ర‌కుల్ మ‌ధ్య స్నేహం చాలా ఉంది. ఇప్ప‌ట్నుంచి కాదు.. ఆమె నిర్మించిన క‌రెంట్ తీగ సినిమా నుంచి మంచు వారి కుటంబంతో ర‌కుల్ కు బంధం పెన‌వేసుకుంది. ఎప్పుడు ఏ వేడుక జ‌రుపుకోవాల‌న్నా కూడా క‌లిసే చేసుకుంటారు.

ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. త‌న పుట్టిన‌రోజును మంచు ల‌క్ష్మితో క‌లిసి సెలెబ్రేట్ చేసుకుంటుంది ర‌కుల్. అక్టోబ‌ర్ 10న ఈమె బ‌ర్త్ డే. ఇండియాకు వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ కానుంది ఈ ముద్దుగుమ్మ‌. ఏదేమైనా వీళ్ల పోజ్ మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here