మ‌హేశ్ వ‌చ్చాడు.. కానీ మ‌ళ్లీ వెళ్తున్నాడు..

అర్థం కాలేదు క‌దా.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. మ‌హేశ్ బాబు దూకుడు చూస్తుంటే ఇప్పుడు మ‌హ‌ర్షి పూర్త‌య్యే వ‌ర‌కు కూడా ఖాళీగా ఉండేలా క‌నిపించ‌డం లేదు. షూట్ పూర్త‌య్యేవ‌ర‌కు కూడా నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి.

ఇప్ప‌టికే చాలా బ్రేక్స్ తీసుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు మ‌రోసారి బ్రేక్ తీసుకుంటే అనుకున్న టైమ్ కంటే షూటింగ్ ఆల‌స్యం అయ్యే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. ఈ మ‌ధ్యే థాయ్ లాండ్ లో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వ‌చ్చాడు ఫ్యామిలీతో సూప‌ర్ స్టార్. ఇప్పుడు ఇండియాకు వ‌చ్చేసాడు. అక్టోబ‌ర్ 15 నుంచి ఈయ‌న కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది.

అమెరికాలో ఇది జ‌ర‌గ‌నుంది. అక్క‌డే 20 రోజులు షూటింగ్ చేయ‌నున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ. ఇక ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 10 నుంచి హైద‌రాబాద్ లోనే నాన్ స్టాప్ క్లైమాక్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. ఒకేసారి షూటింగ్ పూర్త‌య్యేవ‌ర‌కు కూడా ఇది జ‌రుగుతూనే ఉంటుంది.

ఎట్టి ప‌రిస్థితుల్లో ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు వంశీ. జ‌న‌వ‌రి నుంచి నాలుగు నెల‌ల పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో బిజీగా ఉండ‌నున్నారు టీం. ఎప్రిల్ 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది. దిల్ రాజు, అశ్వీనిద‌త్, పివిపి క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here