106 ఏళ్ళ ఫ్యాన్ తో మ‌హేష్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..

మ‌హేష్ బాబుకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంద‌ని తెలుసు కానీ మ‌రీ అమ్మ‌మ్మ‌లు నాయ‌న‌మ్మ‌ల ఫాలోయింగ్ కూడా ఉంద‌ని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సూప‌ర్ స్టార్ ఫాలోయింగ్ అలా ఉంది మ‌రి. ఆయ‌న్ని చూస్తుంటే ఎవ‌రైనా ఇట్టే ప‌డిపోతున్నారు. ఇప్పుడు 106 ఏళ్ల బామ్మ కూడా ఇలాగే ప‌డిపోయింది. ఆమె పేరు స‌త్య‌వ‌తి.. ఊరు రాజ‌మహేంద్ర‌వ‌రం.. ఎందుకో తెలియ‌దు మ‌హేశ్ బాబు అంటే చాలా ఇష్టం. కేవ‌లం సూప‌ర్ స్టార్ ను చూడ్డానికి హైద‌రాబాద్ వ‌చ్చింది.

ఆ విష‌యం ఎలాగోలా మ‌హేష్ కూడా తెలుసుకున్నాడు. అందుకే త‌న మ‌హ‌ర్షి సెట్ లో ఆ బామ్మ‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నాడు. కాసేపు స‌ర‌దాగా మాట్లాడాడు.. అంతా బాగున్నార‌ని చెప్పాడు.. మీరు బాగున్నారా అని అడిగాడు. అస‌లు మ‌హేష్ బాబును చూడగానే ఆ 106 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్.. ప‌డిన ఆనందం చూస్తుంటే ఎవ‌రికైనా ముచ్చ‌టేస్తుంది. అస‌లు ఆ ఏజ్ లో ఉన్న బామ్మ‌కు మ‌హేష్ బాబు ఎలా న‌చ్చాడో.. అంత‌గా ఎలా మైమ‌రిచిపోయిందో తెలియ‌దు మ‌రి. త‌న మీద ఆ పెద్దావిక చూపించిన అభిమానం చూసి మ‌హేష్ కూడా మ‌రో లోకంలోకి వెళ్లిపోయాడు. ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలో త‌న మ‌న‌సులో మాట రాసుకున్నాడు ఈ హీరో.

Mahesh babu meets 106 years old fan
Mahesh babu meets 106 years old fan

ఇన్నేళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. ఆమె తన అభిమానంతో నా హృదయాన్ని గెలుచుకున్నారు.

 

నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రాసుకున్నాడు మ‌హేష్ బాబు. ఇప్పుడు ఈ 106 ఏళ్ల బామ్మ వైర‌ల్ అయిపోయింది సోష‌ల్ మీడియాలో. మొత్తానికి హీరోలు ఇప్పుడు త‌మ అభిమానుల కోసం బాగానే క‌దిలొస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here