మ‌హేష్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టిన ర‌జినీకాంత్..

మ‌హేష్ బాబు రికార్డ్ ర‌జినీకాంత్ బ‌ద్ద‌లు కొట్టాడా.. ఇంత‌కీ ఏంట‌ది అనుకుంటున్నారా..? ఇప్ప‌టి రికార్డ్ కాదు అది ఏడేళ్ల కింద రికార్డ్. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా అది అలాగే ఉండిపోయింది. బిజినెస్ మేన్ తో మ‌న సూప‌ర్ స్టార్ సృష్టించిన రికార్డును ఇన్నాళ్ల‌కు ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ తిర‌గ‌రాసాడు. క‌లెక్ష‌న్ల ప‌రంగానో.. మ‌రేదో ఏదో కాదు.. ఐమాక్స్ లో తొలిరోజు షోస్ ప‌రంగా.

amb-cinema

ఇప్ప‌టి వ‌రకు ప్ర‌సాద్ ఐమాక్స్ లో తొలిరోజు హైయ్య‌స్ట్ షోస్ రికార్డ్ 33. అది 2012లో బిజినెస్ మేన్ సినిమా కోసం వేసారు. అప్పట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌ల సినిమాలు వచ్చిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ఆ రికార్డ్ అలాగే ఉంది. బాహుబ‌లి 2, ఖైదీ నెం.150 లాంటి సినిమాల‌కు కూడా ఇది సాధ్యం కాలేదు. వాటి షోస్ 30-32 మ‌ధ్య‌లోనే ఉన్నాయి. అంతెందుకు మ‌హేష్ త‌ర్వాత న‌టించిన సినిమాల‌కు కూడా ఈ షోస్ లెక్క ప‌డ‌లేదు.

కానీ ఇన్నేళ్ళ త‌ర్వాతిప్పుడు 2.0 ఈ రికార్డ్ బ్రేక్ చేసింది. ఐమాక్స్ లో తొలిరోజే ఏకంగా 35 షోలు ప‌డుతున్నాయి. ఎక్క‌డ ఏ షో చూసినా 2.0 క‌నిపించేలా ప్లాన్ చేస్తున్నారు థియేట‌ర్ యాజ‌మాన్యం. పైగా తొలిరోజే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ముఖ్యంగా 3డి టికెట్స్ అయితే క‌నీసం క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ రేంజ్ లో వ‌స్తున్న 2.0కు టాక్ కూడా బాగా వ‌స్తే అద్భుతంగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉంది లేదంటే అంతే సంగ‌తులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here