అమీర్ మిస్సైనా రజ‌నీకాంత్ ని ప‌ట్టేసిన మ‌హేష్..

ఇన్నాళ్లూ హీరోగానే చూసిన మ‌హేశ్ బాబు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా కూడా మారిపోయాడు. ఈయ‌న గురించి ముందే ఊహించాడేమో పూరీ జ‌గ‌న్నాథ్.. అందుకే ఐదేళ్ల ముందే బిజినెస్ మ్యాన్ సినిమా సూప‌ర్ స్టార్ తో చేసాడు పూరీ. ఇప్పుడు ఈ టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఇటు సినిమాలు.. అటు బిజినెస్ లో దూసుకెళ్తున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు సినిమాలు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం లేద‌ని చెప్పిన మ‌హేశ్.. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ వెళ్తున్నాడు. ఇప్ప‌టికే ఏషియ‌న్ ఫిల్మ్ ఓన‌ర్ సునీల్ నారంగ్ తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్పుడు మ‌ల్టీప్లెక్సుల‌కు ఉన్న ఆద‌ర‌ణ చూసిన మ‌హేశ్.. ఇందులో 150 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌చ్చిబౌలి ఓపెన్ స్థ‌లాల్లో ఈ మ‌ల్టీప్లెక్సుల నిర్మాణం జ‌రుగుతుంది.

maheshbabu

ఇప్పుడు ఇది పూర్తైపోయి..న‌వంబ‌ర్ 29న ఓపెనింగ్ కూడా అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ముందు ఈ మ‌ల్టీప్లెక్స్ ల‌ను అమీర్ ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతోనే ఓపెన్ చేయాల‌ని చూసాడు మ‌హేష్ బాబు. దానికోసం అమీర్ ఖాన్ ను హైద‌రాబాద్ ర‌ప్పించాల‌ని చూసాడు. అయితే ఆయ‌న ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉండి రాలేదు. ఇప్పుడు రాక‌పోవ‌డ‌మే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మ‌హేష్ బాబు. లేదంటే త‌న మ‌ల్టీప్లెక్స్ ఓ డిజాస్ట‌ర్ తో ఓపెన్ అయ్యుండేది. ఇప్పుడు అమీర్ మిస్సైనా ర‌జినీకాంత్, అక్ష‌య్ కుమార్ ల‌ను హైద‌రాబాద్ తీసుకొచ్చి 2.0తో ఈ థియేట‌ర్స్ ఓపెన్ చేయించాల‌ని చూస్తున్నాడు మ‌హేష్ బాబు.

ఆరు భారీ స్క్రీన్లు ఉండేలా ఈ మ‌ల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి AMB స్క్రీన్స్ అనే పేరు పెడుతున్నారు. మ‌రోవైపు మ‌ల్టీప్లెక్సులే కాదు.. కాస్మోటిక్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్ప‌టికే తాను చాలా కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. ఇందులోనే ఓ టాప్ కంపెనీతో క‌లిసి టై అప్ అవుతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ వాటా 70 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు బిజినెస్ ల‌తో పాటు మ‌రికొన్ని బిజినెస్ ల‌పై కూడా మ‌హేశ్, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ క‌న్నేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఓ వైపు సినిమా రంగంలో సూప‌ర్ స్టార్ గా వెలిగిపోతూనే.. మ‌రోవైపు బిజినెస్ లోనూ దుమ్ము దులిపేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here