మ‌హేశ్ బాబు టైటిల్ అదేనా..?

ఇప్పుడు సూప‌ర్ స్టార్ 25వ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ఇన్ని రోజులు ఏమో కానీ గ‌త మూడు రోజుల నుంచి రోజుకో కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ఆస‌క్తి పెంచేస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. పైగా అందులో కొన్ని హింట్లు కూడా ఇస్తున్నాడు. ఈయ‌న త‌న పోస్ట‌ర్స్ తో ప్రేక్ష‌కుల‌కు ఏదో చెప్పాల‌ని చూస్తున్నాడు. ఇంట్రెస్టింగ్.. రైజింగ్.. సూప‌ర్ స్టార్ అంటూ ఆర్ ఐ ఎస్ అక్ష‌రాల‌ను బాగా హైలైట్ చేస్తున్నాడు. ఈ మూడు క‌లిపితే వ‌చ్చే టైటిల్ రిషి. ఇప్పుడు ఈ చిత్రానికి ఇదే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఫారెన్ నుంచి ఇండియాకు వ‌చ్చిన కంపెనీ సిఈఓగా ఇందులో న‌టిస్తున్నాడు మ‌హేశ్.

రైతు స‌మ‌స్య‌ల ఆధారంగా సినిమా తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌రుగుతుంది. అల్ల‌రి న‌రేష్ కూడా ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఆగ‌స్ట్ 9న ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా విడుద‌ల కానుంది. 25వ సినిమా కావ‌డంతో ద‌ర్శ‌కుడు కూడా ఫ‌స్ట్ లుక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నాడు. ఫ్యాన్స్ ఊహలు అంచ‌నాలు ఎలా ఉంటాయో తెలుసు కాబ‌ట్టే ఇంతగా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు వంశీ. సినిమా వ‌చ్చే ఏడాది ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. దిల్ రాజు, అశ్వినీద‌త్, పివిపి క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here