రిషితో కొత్త ఏడాది సెలెబ్రెట్ చేసుకుందామా…?

మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తి చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ మధ్య భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిన్న బ్రేక్ తీసుకున్నాడు సూపర్ స్టార్. ఇప్పుడు మళ్లీ న్యూ ఇయర్ సందర్భంగా ఈ మరో షెడ్యూల్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా నుంచి మరో లుక్ విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు వంశీ పైడిపల్లి. కొత్త సంవత్సరాన్ని రిషి తో కలిపి సెలబ్రేట్ చేసుకోండి.. మీ అపాయింట్మెంట్ రిషితో ఫిక్స్ అయిపోయింది.. ఆయనతో ప్రయాణంలో భాగం అవ్వండి.. అంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పాడు వంశీ పైడిపల్లి.

జనవరి 1న మహర్షి రెండో లుక్ విడుదల కానుంది. ఇది కూడా ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా కచ్చితంగా మహేష్ బాబు. త‌న‌ కెరీర్లో మ‌హ‌ర్షి చిరస్థాయిగా మిగిలిపోతుందని ధీమాగా చెబుతున్నాడు. వంశీ పైడిపల్లి కూడా మ‌హేష్ 25వ సినిమా అద్భుతంగా వస్తోందని సంతృప్తిగా ఉన్నాడు. ఇప్పటివరకు మహేష్ లో చూడని కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నారు వంశీ పైడిపల్లి. ఇందులో రైతుల కోసం పోరాడే యువకుడి పాత్రలో నటిస్తున్నాడు సూప‌ర్ స్టార్. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్, pvp సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న విడుదల కానుంది మహర్షి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here