రాజ‌మౌళి కొడుకు పెళ్లిలో మ‌న హీరోల ర‌చ్చ‌..

రాజమౌళి కొడుకు పెళ్లిని ఇండస్ట్రీ అంతా పండగలా జరుపుకుంటుంది. డిసెంబర్ 30న తాను ప్రేమించిన పూజ ప్రసాద్ తో కార్తికేయ పెళ్లి జైపూర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు వచ్చారు. అయితే పెళ్లి లో చాలా తక్కువ మంది మాత్రమే కనిపించారు అని తెలుస్తుంది. జనవరి 3న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరగబోయే రిసెప్షన్ వేడుకకు వేల సంఖ్యలో రానున్నారు అతిథులు. ఇవన్నీ ఇలా ఉంటే పెళ్లి లో మన టాలీవుడ్ హీరోలు చేసిన అల్లరి మామూలుగా లేదు. ముఖ్యంగా సిగ్గుపడతాడు అనుకునే ప్రభాస్ కార్తికేయ పెళ్లి లో ఓ రేంజ్ లో డాన్స్ లతో కుమ్మేశాడు.

Look What Our Tollywood Heroes Did at SS Karthikeya Wedding
Look What Our Tollywood Heroes Did at SS Karthikeya Wedding

రాజమౌళితో తన సాన్నిహిత్యం అలాంటిది మ‌రి. కార్తికేయని చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాడు ప్రభాస్. అందుకే ఇప్పుడు ఆయన పెళ్లి లో ప్రభాస్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడుజ. ఆయనతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా లాంటి వాళ్లు కూడా డాన్సులతో కుమ్మేశారు. వాళ్లకు రాజమౌళి కూడా కలిశాడు. ఇప్పటివరకు జక్కన్న లో ఈ స్థాయి డాన్సర్ ఉన్నాడని ఎవరికీ తెలియదు. కొడుకు పెళ్లి కోసం ఇన్నాళ్లు ఎనర్జీ అంతా దాచేసుకున్నాడు దర్శకధీరుడు. ఇప్పుడు కార్తికేయ పెళ్లి లో రాజమౌళి డాన్స్ చూసి అభిమానులు కూడా ఆనందంగా ఫీలవుతున్నారు. ఆయనతోపాటు హీరోలు కూడా కార్తికేయ పెళ్లిని సూపర్ గా ఎంజాయ్ చేశారు.

 

 

 

ఈ డాన్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ తలపాగా కట్టుకుని చేసిన డ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారుజ‌ సినిమాల్లో కూడా ఈ స్థాయి డాన్స్ చేయ‌ని ప్రభాస్ కార్తికేయ కోసం కాలు బాగానే కదిపాడు. ఇక ఎన్టీఆర్ కూడా కార్తికేయ పెల్లిని బాగా ఎంజాయ్ చేశాడు. ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నప్పుడు జై బాలయ్య అంటూ అందరినీ ఉత్తేజ పరిచారు ఎన్టీఆర్. వీళ్లందరి రచ్చ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడో జైపూర్ కోటలో కార్తికేయ పెళ్లి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక అక్కడే రచ్చ అలా ఉంటే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here