క‌న్న‌డ బాహుబ‌లి కేజీయ‌ఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌..

క‌న్న‌డ బాహుబ‌లి ఏంటి అనుకుంటున్నారా..? మ‌న ద‌గ్గ‌ర బాహుబ‌లి చేస్తున్న‌పుడు అంతా గ‌ర్వంతో ఉప్పొంగిపోయారు క‌దా. మ‌న సినిమా బ‌డ్జెట్ పెరిగింది.. తెలుగు సినిమా రేంజ్ పెరిగింది అని. ఇప్పుడు క‌న్న‌డ‌నాట కూడా ఇదే జ‌రుగుతుంది. అక్క‌డ కూడా భారీ సినిమా ఒక‌టి రెడీ అవుతుంది. కేజియ‌ఫ్ అంటూ ప్ర‌శాంత్ నీల్ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం తొలిసారి క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో 50 కోట్ల‌తో తెర‌కెక్కుతుంది.
kgf
య‌శ్ ఇందులో హీరో. వ‌ర‌స విజ‌యాల‌తో అక్క‌డ ర‌చ్చ చేస్తున్న ఈ హీరోకు అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. ఇక ఇప్పుడు కేజియ‌ఫ్ ట్రైల‌ర్ విడుద‌లైంది. అంతా మాఫియా నేప‌థ్యంలోనే ఉన్న ఈ చిత్రం 1951 స‌మ‌యంలో మొద‌ల‌వుతుంది. తంగం అనే మాఫియా డాన్ క‌థే ఇది. ముంబైలోనే క‌థ అంతా సాగుతుంది. ఎక్కువ‌గా మైనింగ్ మాఫియాపై తీసిన సినిమా ఇది. తెలుగులో కూడా కేజియ‌ఫ్ ని విడుద‌ల చేస్తున్నారు.
ఇక్క‌డ కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం వ‌స్తుంది. త‌మ‌న్నా ఇందులో ఐటం సాంగ్ చేయ‌డం విశేషం. ఇదే తెలుగులో సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కూడా. అయితే య‌శ్ అంటే ఎవ‌రో తెలియ‌క‌పోవ‌డం ఇక్క‌డ కేజీయ‌ఫ్ కు పెద్ద మైన‌స్. మ‌రి ప్ర‌మోష‌న్స్ తో ఈ చిత్రాన్ని ఇక్క‌డ కూడా విజ‌యం వైపు ప‌య‌నించేలా చేస్తారో లేదో చూడాలి. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల, హిందీల్లోనూ కేజీయ‌ఫ్ ను రిలీజ్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here