రాజ‌మౌళి సినిమాలో విల‌న్ ఎవ‌రో తెలుసా..?

KGF Hero Yash to act in RRR

రాజ‌మౌళి సినిమా అంటేనే ఇంట్రెస్ట్.. అందులో మ‌రిన్ని ఇంట్రెస్టింగ్ న్యూసులు రోజుకొక‌టి తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రంలో విల‌న్ గా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ వ‌స్తున్నాడు. ఈగ కోసం సుదీప్ ను విల‌న్ గా మార్చేసిన ఈయ‌న ఇప్పుడు మ‌రో క‌న్న‌డ స్టార్ ను ప‌ట్టుకొస్తున్నాడు. అత‌డే య‌శ్. ఇప్పుడు క‌న్నడ నేల‌పై చ‌క్రం తిప్పుతున్నాడు ఈ కుర్ర హీరో. వర‌స విజ‌యాల‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. క‌న్నడ ఇండ‌స్ట్రీలో హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ కేజీయఫ్ హీరో కూడా అతడే.

50 కోట్ల‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో య‌శ్ ను చూసి త‌న సినిమాకు విల‌న్ గా అయితే బాగుంటాడ‌ని అత‌డి వైపు వెళ్తున్నాడు ద‌ర్శ‌కధీరుడు. రాజ‌మౌళి ఆఫర్ పై య‌శ్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడు. పారితోషికం కూడా భారీగానే అంద‌చేస్తున్నార‌ని తెలుస్తుంది. ఈ సినిమాకు క‌చ్చితంగా య‌శ్ కూడా ప్ర‌ధాన బ‌లం అవుతాడని భావిస్తున్నాడు రాజ‌మౌళి. అందుకే అత‌న్ని విల‌న్ గా తీసుకుంటున్నాడు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ను ఢీ కొట్టాలంటే అవ‌త‌ల కూడా క‌చ్చితంగా స్టార్ ఉండాల్సిందే.

అందుకే య‌శ్ ను తీసుకుంటున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఇక ఈ చిత్ర‌ బ్యాక్ డ్రాప్ గురించి ఇన్ని రోజులుగా ఎవ‌రికి తోచింది వాళ్లు చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఇప్ప‌టి క‌థ కాదిది.. స్వాతంత్ర్యానికి పూర్వం జ‌రిగిన క‌థ‌. అంటే మ‌ళ్లీ 40ల్లో క‌థ కూడా కాదు.. ఏకంగా 1920ల్లో జ‌రిగిన క‌థ‌. దీనికి త‌గ్గ‌ట్లుగానే ఇప్పుడు గండిపేట్ ప్రాంతంలో మంచి మంచి భారీ సెట్లు వేస్తున్నారు రాజ‌మౌళి టీం. ద‌ర్శ‌క‌ధీరుడు కూడా వాటిని ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా జ‌రుగుతుందిప్పుడు.

ఈ షెడ్యూల్లో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఉన్నారు. బోయ‌పాటి సినిమాతో పాటే రాజ‌మౌళి సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు చ‌ర‌ణ్. మ‌రోవైపు ఎన్టీఆర్ మాత్రం అన్ని బంధాలు తెంచేసుకుని ఇప్పుడు రాజ‌మౌళి కోసం అంకితం అయిపోయాడు. ఈ స్వాతంత్ర్యానికి పూర్వం క‌థ‌తో ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను రాజ‌మౌళి ఎలా తెర‌కెక్కిస్తున్నాడ‌నేది ఆస‌క్తిక‌ర‌మే. ఈ చిత్రం 2020లో విడుద‌ల కానుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ఎదురుచూపులు త‌ప్ప‌వు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here