కేజీఎఫ్.. మామూలుగా కుమ్మ‌ట్లేదుగా బాక్సాఫీస్ ను..

బంగారం ధరలు ఎప్పుడు తగ్గవు. వాటి ధరలు ఆకాశం లోనే ఉంటాయి. మరి అలాంటి బంగారం గ‌నుల మీద తీసిన సినిమా ఇంకా ఎంత వసూలు చేయాలి..? ఇప్పుడు కే జి ఎఫ్ అదే చేస్తుంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు వసూళ్ల‌ సంచలనం సృష్టిస్తుంది. రోజురోజుకు సినిమా రచ్చ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీల్లో కూడా కేజీఎఫ్ అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది.

KGF Box Office First Week Collections

నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం. తెలుగులో అయితే ఐదు కోట్ల షేర్ ఇప్పటికే దాటేసింది కేజీఎఫ్. ఈ సినిమాకు ముందు కనీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులైనా వస్తాయా అని నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

హిందీలో కూడా కే జి ఎఫ్ అరాచ‌కాలు సాగుతున్నాయి. అక్కడ ఇప్పటికే పది కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. రోజుకు కనీసం మూడు కోట్లు వసూలు చేస్తూ కన్నడ సినిమా పవర్ ఏంటో హిందీ లో చూపిస్తుంది. ఇప్పటివరకు అసలు కన్నడ సినిమా అంటూ ఒకటి ఉందని బాలీవుడ్ కు తెలియను కూడా తెలియదు. కానీ ఇప్పుడు కేజిఎఫ్ దెబ్బకు కన్నడ సినిమా సత్తా కూడా వాళ్లకు అర్ధమైంది.

కన్నడనాట అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ హై రేంజ్ లో కుమ్మేస్తుంది. ఇప్పటికే అక్క‌డ 35 కోట్ల మార్క్ దాటేసింది కేజీఎఫ్. ఫుల్ రన్లో ఈజీగా 70 నుంచి 80 కోట్ల వరకు వసూలు చేసేలా కనిపిస్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ఓవరాల్ గా 200 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here