స‌వ్య‌సాచి సాంగ్.. కీర‌వాణి ఫాస్ట్ బీట్..

నాగ‌చైత‌న్య‌-కీర‌వాణి.. కాంబినేష‌న్ చాలా కొత్త‌గా క్రేజీగా ఉంది క‌దా. అందుకే ట్రై చేసాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. ఈ సినిమాలో ఉన్న క‌థ‌కు సీరియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు అయితేనే ప‌ర్ఫెక్ట్ అని భావించిన చందూ మొండేటి.. కీర‌వాణిని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలోని తొలిపాట విడుద‌లైంది. సాధార‌ణంగా కీర‌వాణి అంటే గుర్తొచ్చే మెలోడి ఇందులో లేదు. కాస్త ఫాస్ట్ బీట్ తోనే వ‌చ్చాడు కీర‌వాణి.

Savyasachi

నిధి అగ‌ర్వాల్ అందాలు కూడా ఈ సినిమాకు బోనస్. ఇక ఈ చిత్ర టీజ‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా చైతూ ఈ సారి గ‌ట్టిగా కొడ‌తాడేమో అనిపిస్తుంది. తెలియ‌ని క‌థ కాబ‌ట్టి కాస్త కొత్త‌గా ఆక‌ట్టుకునేలా చెబితే క‌చ్చితంగా సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌న‌డంలో సందేహం అయితే లేదు.

ఒక్క శ‌రీరంలోనే ఇద్ద‌రు క‌వ‌ల‌లు ఉంటే ఏంటి అనేది ఈ పాత్ర ప్ర‌త్యేక‌థ‌. మిస్ క్యారేజ్ అయిన‌పుడు మాత్ర‌మే ఇలాంటి అద్భుతాలు జ‌రుగుతుంటాయి. ఒకే శ‌రీరంలోకి రెండు ప్రాణాలు వ‌చ్చి చేరుతుంటాయి. రెండో బేబీ ర‌క్తం.. మెదడు.. శ‌రీరం కూడా మొద‌టి బేబీతో పాటే క‌లిసిపోయి ఇద్ద‌రు ఒక్క‌డిగా పుడుతుంటారు. ఈ టీజ‌ర్ చాలా రీ ఫ్రెషింగ్ గా అలాగే సృజ‌నాత్మ‌కంగా ఉంది. మొత్తానికి మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. కీర‌వాణి ఆర్ఆర్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక చూడాలి.. స‌వ్య‌సాచితో చైతూ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో..?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *