క‌వ‌చం ముందు భారీ ల‌క్ష్యం.. 22 కోట్లు తెస్తాడా..?

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు చేసాడు అనేది అన‌వ‌స‌రం.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు.. ఎంత తెస్తున్నాడు అనేది అవ‌స‌రం. ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది. ఎందుకంటే అల్లుడు శీనుతో 25 కోట్లు.. జ‌య జాన‌కీ నాయ‌క‌తో 24 కోట్లు వ‌సూలు చేసాడు ఈ హీరో.

Kavacham telugu Movie Budget

అయితే అవి రెండు ఫ్లాపులే. ఎందుకంటే భారీ బ‌డ్జెట్ కార‌ణంగా. ఇక సాక్ష్యం కూడా డిజాస్ట‌రే. ఇలాంటి స‌మ‌యంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ కెరీర్ నిల‌బ‌డాలంటే క‌వ‌చం క‌చ్చితంగా ఆడాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. అయితే ఇదివ‌ర‌కు స్టార్ డైరెక్ట‌ర్స్ అండ చూసుకుని బ‌రిలో దిగాడు శ్రీ‌ను. ఇప్పుడు మాత్రం కొత్త ద‌ర్శ‌కుడితో వ‌స్తున్నాడు.

ఈ విష‌యంలో ఆయ‌న రిస్క్ తీసుకుంటున్నాడు కానీ ఎంత‌వ‌ర‌కు విజ‌యం సాధిస్తాడ‌నేదిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌లు.. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌రోసారి క‌వ‌చంతో గ్రాండియ‌ర్ న‌మ్ముకునే వ‌స్తున్నాడు బెల్లంకొండ‌. డిసెంబ‌ర్ 7న పోలింగ్ డే రోజు విడుద‌ల కానుంది క‌వ‌చం.

డిసెంబ‌ర్ 6నే భారీగా ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి కూడా. ముందు సినిమాల‌తో పోలిస్తే ఈ సారి త‌క్కువ బిజినెస్ తోనే వ‌స్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. కానీ ఎంత‌వ‌ర‌కు దాన్ని అందుకుంటాడు అనేది మాత్రం అనుమాన‌మే. ఇప్పుడు ఈయ‌న ఇమేజ్ మరీ దారుణంగా ఉంది. భారీ బ‌డ్జెట్ తో నవీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే విడుద‌ల‌కు ముందే హిందీ డ‌బ్బింగ్ రైట్స్ 9 కోట్లు.. శాటిలైట్ 8 కోట్లు రావ‌డంతో విడుద‌లకు ముందే ఈ చిత్రం సేఫ్ అయిపోయింది.

అయితే థియేట‌ర్స్ లో సేఫ్ అవ్వాలంటే 22 కోట్లు రావాల్సిందే. మ‌రి ఇప్పుడు బెల్లంకొండ ఉన్న ప‌రిస్థితుల్లో అన్ని కోట్లు తీసుకొస్తాడా అనేది అనుమాన‌మే. మ‌రి చూడాలి.. అల్లుడు శీను.. స్పీడున్నోడు.. జ‌య జానకీ నాయ‌కా.. సాక్ష్యం.. ఫ్లాపుల త‌ర్వాత వ‌స్తున్న బెల్లంకొండ ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here