బెల్లంకొండ‌తో కాజ‌ల్ అందాల క‌వ‌చం..

ఏ మాటకా మాటే..! ఈ మ‌ధ్య స్టార్ హీరోలు కూడా బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను చూసి కాస్త కుళ్లుకునే ఉంటారు. మ‌నోడు వ‌స్తున్న తీరు అలా ఉంది మ‌రి. ప్ర‌తీ సినిమాతో భారీ బ‌డ్జెట్.. దానికితోడు టెక్నీషియ‌న్స్.. స్టార్ హీరోయిన్స్.. ద‌ర్శ‌కులు.. సెట‌ప్ అంతా చూస్తుంటే బాపురే అనిపిస్తుంది.

Kavacham Movie release on december 7th

ఇక ఇప్పుడు క‌వ‌చం కూడా అంతే. దీనికి మిన‌హాయింపేమీ కాదు. ఈ చిత్రంలో కూడా స్టార్ క్యాస్ట్ కు ఏ మాత్రం లోటులేదు. మొన్న విడుదలైన టీజ‌ర్.. ఇప్పుడు విడుద‌లైన పాట చూస్తుంటే మ‌రోసారి గ్రాండియ‌ర్ తోనే వ‌స్తున్నాడు బెల్లంకొండ‌. డిసెంబ‌ర్ 7న పోలింగ్ డే రోజు విడుద‌ల కానుంది క‌వ‌చం. డిసెంబ‌ర్ 6నే భారీగా ప్రీమియ‌ర్స్ ప‌డుతున్నాయి కూడా.

ఈ చిత్రంలో కాజ‌ల్, మెహ్రీన్ హీరోయిన్లు. ఇప్ప‌టికే కాజ‌ల్ తో మంచి కెమిస్ట్రీ కుదిరింది ఈ కుర్రాడికి. ఇప్పుడు విడుద‌లైన పాట కూడా అంతే. దుబాయ్ లో అదిరిపోయే విజువ‌ల్స్ లో పాట చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ల‌. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు బెల్లంకొండ‌. భారీ బ‌డ్జెట్ తో నవీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు పాతిక కోట్ల వ‌ర‌కు పెట్టారు. అల్లుడు శీను.. స్పీడున్నోడు.. జ‌య జానకీ నాయ‌కా.. సాక్ష్యం.. ఇలా అన్నీ ఫ్లాపులే. కానీ ఈ సారి మాత్రం క‌చ్చితంగా హిట్ కొడ‌తానంటున్నాడు ఈ కుర్ర హీరో. మ‌రి కాజ‌ల్ అందాల కవ‌చంతో బెల్లంకొండ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఎలాంటి యుద్ధం చేస్తాడో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here