క‌థానాయ‌కుడుకు అమేజాన్ అమేజింగ్ రేట్.

నిర్మాతగా బాలకృష్ణ చేస్తున్న తొలి ప్రయత్నమే.. విడుదలకు ముందే బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేలా కనిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ఎన్.బి.కె ఫిలిమ్స్ లో నిర్మిస్తున్న బాలయ్య.. రిలీజ్ కు ముందే ఈ చిత్రంతో భారీ లాభాలు అందుకుంటున్నాడు. బిజినెస్ లో క‌థానాయ‌కుడు సంచలనాలు సృష్టిస్తుంది.

Kathanayakudu Digital and Satellite rights sold Highest Price

జనవరి 9 న విడుదల కానున్న ఈ సినిమా బిజినెస్ భారీగా జ‌రుగుతుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా 25 కోట్లు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గాని జరిగితే బడ్జెట్ లో సగానికి పైగా అమెజాన్ ఇచ్చినట్లే. పైగా కథానాయకుడు శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మ‌లేదు బాల‌య్య‌. విడుద‌ల స‌మ‌యానికి ఇంకా రేట్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని ఆయ‌న‌కు తెలుసు. అందుకే అవి అలాగే ఉంచాడు. ఇప్పుడు ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ కథానాయకుడు కోసం చానల్స్ అన్ని పోటీ పడుతున్నాయి.

కచ్చితంగా ఈ సినిమా టీవీల్లో సంచలనం సృష్టిస్తుందని న‌మ్ముతున్నారు ఛానెల్ యాజ‌మాన్యం. ఎందుకంటే అది అన్నగారి బయోపిక్. ఆ నమ్మకంతోనే శాటిలైట్ రేట్ కోసం పోటీ ప‌డుతున్నాయి టాప్ ఛానెల్స్. అమెజాన్ ఇప్పటికే 25 కోట్లకు డీల్స్ చేయగా శాటిలైట్ కూడా అన్ని భాషలలో కలిపి దాదాపు 25 కోట్లు వచ్చేలా కనిపిస్తుంది. మొత్తంగా థియేట్రికల్ కలెక్షన్లు కాకుండా నిర్మాత జేబుల్లోకి ఇప్పటికే 50 కోట్లు వచ్చాయి.

ఇక రేపు సినిమా విడుదలైన తర్వాత వచ్చేవన్నీ బోనస్ అన్నమాట. దర్శకుడు క్రిష్ కాబట్టి సినిమా కచ్చితంగా బాగుంటుందని అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. పైగా కథానాయకుడు సినిమాలో వివాదాలు కూడా ఏమీ ఉండవు. ఎమోషనల్ జర్నీగా ఈ చిత్రం ఉంటుంది. జనవరి 9 థియేటర్ లోకి వ‌స్తున్నాడు క‌థానాయ‌కుడు. మరి సంక్రాంతికి ఈ చిత్రం ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుంది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here