క‌న్న‌డ రెబ‌ల్ స్టార్ అంబ‌రీష్ క‌న్నుమూత‌..

క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో మ‌రో ధృవ‌తార నేల‌రాలింది. ఇప్ప‌టికే అక్క‌డ రాజ్ కుమార్, విష్ణువ‌ర్ద‌న్ లాంటి సూప‌ర్ స్టార్స్ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయారు. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న హీరో.. లెజెండ‌రీ యాక్ట‌ర్.. రెబ‌ల్ స్టార్ అంబ‌రీష్ క‌న్నుమూసారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఈయ‌న బెంగళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్లో చికిత్స పొందుతూ న‌వంబ‌ర్ 24 రాత్రి తుదిశ్వాస విడిచారు. 1952 మే 29న మైసూర్‌ రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో జన్మించారు. 46 ఏళ్ల కింద విష్ణువ‌ర్ద‌న్ హీరోగా న‌టించిన నాగ‌హ‌ర‌వు సినిమాలో విల‌న్ గా న‌టించాడు అంబ‌రీష్. అది 1972లో విడుద‌లైంది. ఆ త‌ర్వాత చాలా సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి హీరో అయ్యారు.

Kannada Actor Ambareesh Dies in Bengaluru Hospital

అయిన త‌ర్వాత ఎన్నో సంచ‌ల‌న సినిమాలు చేసారు అంబ‌రీష్. పాండ‌వార‌ల్లి పాండ‌వురు, శుభ‌మంగ‌ళ‌, మాసంద‌, రంగ‌నాయ‌కి లాంటి సినిమాలు అంబ‌రీష్ ను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసాయి. ముఖ్యంగా త‌న ప్రాణ స్నేహితుడు విష్ణువ‌ర్ధ‌న్ తో క‌లిసి చాలా సినిమాలు చేయ‌డ‌మే కాకుండా ఇద్ద‌రూ పోటీ ప‌డి మ‌రీ సినిమాలు చేసారు. క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ పెర‌గ‌డానికి.. అక్క‌డి మార్కెట్ పెంచ‌డానికి ఈయ‌న ఎన్నో తోడ్ప‌డ్డారు. అంబ‌రీష్ అస‌లు పేరు మాల‌వ‌ల్లి హుచ్చే గౌడ అమ‌ర్ నాథ్. సినిమాల్లోకి వ‌చ్చిన అంబ‌రీష్ గా పేరు మార్చుకున్నారు. ఈయ‌న ప్ర‌ముఖ సినీ న‌టి సుమలతను 1991లో పెళ్లి చేసుకున్నారు. సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్‌ అనంతరం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్‌ తరఫున కర్ణాటక ఎన్నికల్లో గెలిచి 2013లో ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.

క‌న్న‌డనాట హీరోగా అత్య‌ధిక సినిమాలు చేసిన రికార్డ్ అంబ‌రీష్ పేరు మీదే ఉంది. ఈయ‌న 207 సినిమాల్లో లీక్ యాక్ట‌ర్ గా న‌టించారు. ఇంత‌కుముందు లెజెండ‌రీ న‌టుడు రాజ్ కుమార్ పేరు మీదున్న రికార్డును త‌న పేర రాసుకున్నాడు అంబ‌రీష్. ఈ విష‌యంలో విష్ణువ‌ర్ధ‌న్ తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాల భాష‌ల్లో క‌లిపి 230 సినిమాల్లో హీరోగా న‌టించారు. రాజ‌కీయాల్లోనూ మూడుసార్లు ఎంపిగా.. ఓ సారి కేంద్ర‌మంత్రిగా ప‌ని చేసారు. కాంగ్రెస్ లో ఈయ‌న ఎక్కువ కాలం కొన‌సాగారు. ఈయ‌న మృతికి అన్ని ఇండ‌స్ట్రీల‌తో పాటు రాజ‌కీయ పార్టీలు కూడా సంతాపాన్ని తెలియ‌జేసాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here