కాస్టింగ్ కౌచ్ తో క‌మ‌ల్ హాస‌న్ క‌మెంట్స్..

కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఇండియ‌న్ సినిమాను కుదిపేస్తున్న మాట‌. మీటూ అంటూ ఎవ‌రికి వాళ్లు బ‌య‌టికి వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను చెప్పుకుంటున్నారు హీరోయిన్లు. ఈ ఉద్య‌మం గురించి అంతా స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ సైతం దీని గురిచి మాట్లాడాడు.

KAMAL-HASAN

కానీ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు మాత్రం చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తున్నాయి. ఈయ‌న అన్యాయం జ‌రిగిన వాళ్లు మాత్ర‌మే మాట్లాడాలి కానీ అంద‌రూ కాదంటూ సీరియ‌స్ వార్నింగే ఇచ్చాడు. ఆడ‌వాళ్లు ఇలా త‌మ‌కు న్యాయం కావాలంటూ బ‌య‌టికి రావ‌డం ఆనంద‌క‌ర‌మైన ప‌రిణామ‌మే.

కానీ నిజంగా అన్యాయం అయిన వాళ్లు మాత్ర‌మే ఇలా వ‌స్తుంటే బాగుండేది కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అలా అనిపించ‌ట్లేదు. ఆ పేరుతో అంతా వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నారు ఇదే అస‌లు బాధ అంటూ క‌మెంట్ చేసాడు క‌మ‌ల్. నిజంగా కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద విష‌యం అని.. క‌చ్చితంగా దాన్ని నిర్మూలించాల్సిన అవ‌స‌రం అంద‌రిపై ఉంద‌ని గుర్తు చేసాడు క‌మ‌ల్. అయితే అన్యాయం జ‌రిగిన వాళ్లు మాత్ర‌మే మాట్లాడాల‌ని ప‌దేప‌దే గుర్తు చేస్తున్నాడు లోక నాయ‌కుడు. ఈ లెక్క‌న ఉద్యమం త‌ప్పుదోవ ప‌డుతుంద‌ని కొంద‌రు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు క‌మ‌ల్ వ్యాఖ్యాలు ఆజ్యం పోసాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here