ఎన్టీఆర్ బ‌యోపిక్ లో హ‌రికృష్ణ పాత్ర ప్రాణం..

క్రిష్ ఏదో మాయ చేస్తున్నాడు.. ఈయ‌న దూకుడు చూస్తుంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ చ‌రిత్ర‌లో నిలిచిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఒక్కో పోస్ట‌ర్ విడుద‌ల అవుతుంటే అస‌లు అభిమానులు ఆగ‌లేక‌పోతున్నారు. నిజంగానే ప్రాణాలు పోసి అంద‌ర్నీ మ‌ళ్లీ తెర‌పై చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు విడుద‌లైన హ‌రికృష్ణ లుక్ కూడా ఇలాగే ఉంది. క‌ళ్యాణ్ రామ్ అచ్చంగా నాన్న‌లా మారిపోయాడు. ఆ ప‌క్క‌నే బాల‌య్య కూడా ఎన్టీఆర్ ను మ‌రోసారి త‌ల‌పించాడు. సినిమా అయ్యే స‌రికి బాల‌య్య పూర్తిగా ఎన్టీఆర్ అయిపోతాడేమో..? అంత‌గా మాయ చేస్తున్నాడు క్రిష్. ఇక క‌ళ్యాణ్ రామ్ కూడా చాలా బాగున్నాడు. ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ లో కూడా తండ్రీ కొడుకులు ఏదో మాట్లాడుకుంటున్నారు.

Ntr biopic

సినిమాలో హ‌రికృష్ణ పాత్ర కీల‌కంగా ఉండ‌బోతుంద‌ని.. ఆయ‌న ముఖ్య‌మంత్రి అవ్వ‌డంలో చైత‌న్య ర‌థం పాత్ర అంద‌రికీ తెలిసిందే.. ఇదే సినిమాలో ఇంకా హైలైట్ అయ్యే విధంగా తెర‌కెక్కిస్తున్నాడు క్రిష్‌. పైగా ఇప్పుడు హ‌రికృష్ణ భౌతికంగా లేరు.. దాంతో ఆయ‌న గురించి ఏం చూపించినా కూడా ప్రేక్ష‌కులు ఎమోష‌న‌ల్ గా క‌నెక్ల్ అవుతారు. ఇదే ప‌ట్టుకుంటున్నాడు ఇప్పుడు క్రిష్.

ఈయ‌న‌కంటే ముందు విడుద‌లైన లుక్స్ కూడా పూర్తిగా ఒరిజిన‌ల్స్ ను త‌ల‌పించేలా ఉన్నాయి. సుమంత్ అయితే ఏఎన్నార్ లా అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోయాడు. ఆయ‌న‌కు పెద్ద‌గా మేకప్ ఖ‌ర్చు కూడా లేన‌ట్లుంది. ఎందుకంటే చూడ్డానికి కూడా అలాగే ఉంటాడు ఈయ‌న‌. కాస్త మారిస్తే తాత‌య్య‌లా మారిపోతాడు సుమంత్. క్రిష్ కూడా ఇప్పుడు ఇదే చేసాడు. ఈయ‌న్ని తీసుకోవ‌డంతోనే స‌గం విజ‌యం సాధించాడు క్రిష్. ఇప్పుడు లుక్ చూసిన త‌ర్వాత విజ‌యం సంపూర్ణం అయింది. ఈయ‌న‌తో పాటు ఈ సినిమాలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రి లుక్ కూడా ఇలాగే ఉండ‌బోతుంది.

కావాల‌నే లెజెండ‌రీ పాత్ర‌ల‌కు వాళ్ల వార‌సుల‌నే తీసుకుంటున్నాడు క్రిష్. బాల‌య్య‌ను ఎన్టీఆర్ గా.. సుమంత్ ను ఏఎన్నార్ గా చూపిస్తున్న ఈయ‌న‌.. సావిత్రిగా నిత్యామీన‌న్ ను తీసుకుంటున్నాడు. శ్రీ‌దేవిగా ర‌కుల్ ఆడిపాడుతుంది. చంద్ర‌బాబు నాయుడుగా ఇప్ప‌టికే రానా లుక్ అదిరిపోయింది. మొత్తానికి ఈ లుక్స్ తోనే సినిమా రేంజ్ పెంచేస్తున్నాడు క్రిష్. జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు విడుద‌ల కానుంది.. 15 రోజుల గ్యాప్ ఇచ్చి జ‌న‌వ‌రి 24న మ‌హానాయ‌కుడు విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here