క‌ళ్యాణ్ రామ్ నాన్న అయిపోయాడుగా..

అదేంటి.. క‌ళ్యాణ్ రామ్ నాన్న అయి చాలా ఏళ్లైపోయింది క‌దా. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త‌గా కావ‌డం ఏంటి అనుకుంటున్నారా.. అవును ఈయ‌న నాన్న అయ్యాడు.. కానీ ఇప్పుడు సినిమా కోసం మ‌ళ్లీ త‌న నాన్న‌గా మారాడు. ఈయ‌న మ‌రోసారి బాబాయ్ బాల‌య్య‌తో క‌లిసి న‌టిస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం హ‌రికృష్ణ‌గా మారిపోయాడు క‌ళ్యాణ్ రామ్.

KALYAN RAM NTR BIOPIC

త‌న తండ్రి పాత్ర‌ను త‌న‌కంటే ఎవ‌రూ బాగా చేయ‌లేర‌ని చూపించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు ఈ హీరో. ఈ పాత్ర‌ను డిజైన్ చేయ‌డం కూడా ఇలాగే చేస్తున్నాడు క్రిష్. సినిమాలో ఉన్నంత సేపు క‌చ్చితంగా మ‌న‌సుకు హ‌త్తుకునేలా హ‌రికృష్ణ పాత్ర ఉంటుంద‌ని.. ఎన్టీఆర్ కు ఎప్పుడూ వెన్నంటే ఉండే పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ ఒదిగిపోతాడ‌ని న‌మ్ముతున్నారు అభిమానులు.

సార‌థి స్టూడియోస్ లో ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. క‌ళ్యాణ్ ఉన్న సీన్స్ కూడా చిత్రీక‌రించ‌డం మొద‌లుపెట్టాడు క్రిష్‌. చైత‌న్య‌ర‌థం సీన్స్ అన్నీ ఒకేసారి పూర్తి చేయ‌నున్నాడు క్రిష్‌. అస‌లు రెండు భాగాలు ఒకేసారి పూర్తి చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు.. పైగా 15 రోజుల గ్యాప్ లో రెండు సినిమాల‌తో రావ‌డం అద్భుతం.. 6 నెల‌ల్లోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ ఇంత వేగంగా పూర్త‌వుతుంద‌ని ఏ అభిమాని క‌నీసం క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌డు.. ఈ సినిమా కోసం 25 రోజులు డేట్స్ ఇచ్చాడు క‌ళ్యాణ్ రామ్. మ‌రి చూడాలిక‌.. రేపు సినిమాలో హ‌రికృష్ణ పాత్ర ఎంత‌గా దుమ్ము లేప‌నుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *