న‌డుమొంపుతో చంపేసిన చంద‌మామ‌..

కాజ‌ల్ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ రెచ్చిపోయింది. ఈ భామ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండు సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం తేజ ద‌ర్శ‌క‌త్వం లో న‌టిస్తున్న సినిమా కోసం ఆర్ఎఫ్సీలో షూటింగ్ జ‌రుగుతుంది. అక్క‌డే త‌న న‌డుము ఒంపుల‌తో పోటోషూట్ చేసింది చంద‌మామ‌.

kajal-aggarwal

సినిమా షూటింగ్ తో పాటు ప్ర‌మోష‌న్స్ లో కూడా చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో కాక పుట్టించింది కాజ‌ల్. ఆ మ‌ధ్య బాలీవుడ్ మోజులో ప‌డి కాస్త డోస్ పెంచేసిన చంద‌మామ‌.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇదే కంటిన్యూ చేస్తుంది. ఆ మ‌ధ్య ఎమ్మెల్యేలో బాగానే అందాలు ఆర‌బోసింది ముద్దుగుమ్మ‌. సినిమాలోనే కాదు బ‌య‌ట కూడా ఇలాగే హ‌ద్దులు చెరిపేస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. చంద‌మామ హాట్ షోతో ఇప్పుడు బెల్లంకొండ రెండు సినిమాల‌పై అంచ‌నాలు ఆస‌క్తి బాగానే ఉన్నాయి.

పైగా త‌న కంటే వ‌య‌సులో చిన్న‌వాడైన బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో కాజ‌ల్ రొమాన్స్ అబ్బో అదుర్స్ అనిపిస్తుంది. గ‌తేడాది వివేగం, నేనేరాజు నేనేమంత్రి సినిమాల్లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఈ భామ‌.. మెర్స‌ల్ లో బాగానే అందాలు ఆర‌బోసింది. ఇక ఈ మ‌ధ్యే ఫోటోషూట్ ల‌లో కూడా దూకుడు చూపిస్తుంది కాజ‌ల్. మొత్తానికి ఈమె అందాల ఆర‌బోత చూస్తుంటే మ‌రో రెండు మూడేళ్ల పాటు ఇండ‌స్ట్రీలోనే హీరోయిన్ గా ఉండాల‌ని ఫిక్సైపోయింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here