ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా..?

ఎన్టీఆర్ బ‌యోపిక్ పై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని అయితే లేదు. ఇక ఈ చిత్రంలో న‌టించే వార‌సుల‌తో కూడా ఆ అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రంలో బాల‌య్య‌.. సుమంత్.. క‌ళ్యాణ్ రామ్ లాంటి న‌టులు వాళ్ల వాళ్ల పెద్ద‌ల రోల్స్ లోనే క‌నిపిస్తున్నారు. ఎన్టీఆర్ గా బాల‌య్య‌.. ఏఎన్నార్ గా సుమంత్.. హ‌రికృష్ణ‌గా క‌ళ్యాణ్ రామ్ క‌న్ఫ‌ర్మ్ అయిపోయారు.

NTR-Biopic

షూటింగ్ కూడా జ‌రుగుతుంది. ఇక ఇప్పుడు ఇందులో బాల‌య్య పాత్ర‌కు ఎవ‌ర్ని తీసుకోవాలా అనే ఆలోచ‌న‌లో ఉన్నాడు క్రిష్.
దీనికి ఎన్టీఆర్ అయితే బాగుంటాడు అనే టాక్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ తో ఈ విష‌యం గురించి క్రిష్ మాట్లాడాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అర‌వింద స‌మేత అయిన త‌ర్వాత దీని గురించి మాట్లాడ‌తాన‌ని హోల్డ్ లో పెట్టాడు జూనియ‌ర్. ఇప్పుడు అర‌వింద స‌మేత విడుద‌ల అవుతుంది.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అయితే దీని గురించి ఏమీ చెప్ప‌లేదు ఈ హీరో. క్రిష్ మాత్రం ఎన్టీఆర్ తోనే బాల‌య్య రోల్ చేయించాల‌ని చూస్తున్నాడు. ఒక‌వేళ ఆయ‌న ఒప్పుకోక‌పోతే పూర్తిగా బాల‌య్య పాత్ర లేకుండానే ఎన్టీఆర్ రానుంది. మ‌రి చూడాలిక‌.. తార‌క్ దీనికి ఒప్పుకుంటాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here