ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఎన్టీఆర్ నో.. సారీ అక్క‌

ఎన్టీఆర్ కొన్నేళ్లుగా సినిమాలు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం లేద‌న్న‌ట్లు ఉన్నాడు. పైగా ఆయ‌న‌కు వ‌ర‌స విజ‌యాలు కూడా వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఎలాంటి రిస్క్ తీసుకోవ‌డానికి జూనియ‌ర్ సైతం సిద్ధంగా లేడు. అయితే ఇప్పుడు ఈయ‌న్ని ఎన్నిక‌ల ప్ర‌చారం వైపు తీసుకురావ‌ల‌నే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. యంగ్ టైగ‌ర్ కు జ‌నాల్లో ఉన్న ఆద‌ర‌ణ‌ను యూజ్ చేసుకుని.. ఎల‌క్ష‌న్ క్యాంపైనింగ్ కి తీసుకురావాల‌ని చూస్తున్నారు కొంద‌రు.

jrntr

ఇదివ‌ర‌కు అయితే దీనికి ఎన్టీఆర్ కూడా నో చెప్పేవాడేమో కానీ ఇప్పుడు హ‌రికృష్ణ పోయిన త‌ర్వాత పార్టీకి మ‌ళ్లీ చేరువ‌య్యాడు.. చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న బాల‌య్య కూడా మ‌ళ్లీ ఎన్టీఆర్ తో క‌లిసాడు. ఇలాంటి స‌మ‌యంలో అడిగితే పార్టీకి ప్ర‌చారం చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌ని లేదేమో..?

పైగా మొన్న జ‌రిగిన అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్ లో హ‌రికృష్ణ‌ను నెత్తిన పెట్టుకున్నాడు బాల‌య్య‌. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు పార్టీ ప్ర‌చారం వైపు ఎన్టీఆర్ అడుగులు వేస్తాడేమో అనిపిస్తుంది. అదే టైమ్ లో రాజ‌మౌళి సినిమా ఉంది కాబ‌ట్టి అంత రిస్క్ తీసుకోడ‌ని కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఇదే నిజ‌మైంది. కూక‌ట్ ప‌ల్లిలో ఎన్టీఆర్ అక్క సుహాసిని నిల‌బ‌డింది. ఆమె కోసం ఎన్టీఆర్ ప్ర‌చారం చేస్తాడ‌నే వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అబ‌ద్ధం అని తేలిపోయింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాన‌ని చెప్పాడు ఎన్టీఆర్. 2009లో ఎన్నిక‌ల ప్ర‌చారం చేసినా కూడా పార్టీ ఓడిపోయింది. అప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా బెడ్డుపై నుంచే ప్ర‌చారం చేసాడు ఈ బుడ్డోడు. ఆ త‌ర్వాత పూర్తిగా పార్టీకి దూరంగానే ఉంటున్నాడు. అప్పుడు జ‌రిగిన చాలా విష‌యాలు ఇప్ప‌టికీ ఎన్టీఆర్ బుర్ర‌ను వ‌ద‌ల్లేదు. అందుకే ప్ర‌చారం అంటే నో అంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here