ఎన్టీఆర్ నోట జై బాల‌య్య.. మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు..

మనం జీవితంలో ఏదైనా కోల్పోయాం అంటే దాని అర్థం మొత్తం పోయింది.. మనకి ఏదో చెడు జరిగి పోయింది అని కాదు.. దాని వెనుక ఇంకో అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంలో కూడా అదే జరిగింది. హరికృష్ణను కోల్పోయి నందమూరి కుటుంబానికి దేవుడు చాలా అన్యాయం చేశారు అంటూ అభిమానులు కూడా చాలా ఫీల్ అయ్యారు. కానీ హరికృష్ణ పోతూ పోతూ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల కు అద్భుతమైన నందమూరి కుటుంబాన్ని గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళాడు. ఏడేళ్లుగా మాట్లాడని బాలయ్య.. ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కలిసి కలిసిపోయాడు. అబ్బాయిలతో కలిసి బాలయ్య కూడా అందమైన మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మధ్య అరవింద సమేత సక్సెస్ మీట్ కి వెళ్ళాడు బాలయ్య. ఆ తర్వాత బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు.

 


ఇలా వీరిద్దరి మధ్య రాకపోకలు బాగానే జరుగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు తమ మధ్య ఉన్న బంధాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి సాక్షిగా బయటకి చెప్పాడు ఎన్టీఆర్. ఆ పార్టీలో అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న టైంలో జై బాలయ్య అంటూ అరిచి బాబాయ్ తనకున్న ప్రేమను ప్రపంచానికి చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ఒక్కసారిగా జై బాలయ్య అని అరవడంతో అక్కడే ఉన్న వాళ్లంతా కూడా ఆయనతో కోరస్ పాడారు. జై బాలయ్య జై బాలయ్య అంటూ కార్తికేయ పెళ్లి వేడుక బాలయ్య అభినందన సభ గా మారిపోయింది. మొత్తానికి ఎన్టీఆర్ చేసిన అల్లరి బాబాయి అబ్బాయి ల మధ్య ఉన్న ప్రేమను మరోసారి బయట పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here