ఎన్టీఆర్ కొత్త‌గా ఉన్నాడే.. భార్య‌తో ఫోటో వైర‌ల్..

రాజ‌మౌళి సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ అయిపోయింది.. ఇప్ప‌ట్లో మ‌ళ్లీ ఆయ‌న సెట్స్ పైకి తీసుకెళ్ల‌డు ఆర్ఆర్ఆర్ ను. దాంతో ఫ్యామిలీతో ఈ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. రామ్ చ‌ర‌ణ్ కు విన‌య విధేయ రామ ఉంది కాబ‌ట్టి అక్క‌డ మెగా ప‌వ‌ర్ స్టార్ బిజీ. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్ర‌స్తుతం ఖాళీ.

Jr Ntr New Look With Wife Viral

అందుకే ఈయ‌న ఇప్పుడు కుటుంబంతో పాటే ఉన్నాడు. ఇక ఇప్పుడు భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో క‌లిసి ఓ ఫ్యాన్ ను క‌లిసాడు ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. గుబురు జుట్టు.. గ‌డ్డంతో చాలా కొత్త‌గా ఉన్నాడు జూనియ‌ర్. ట్రిపుల్ ఆర్ కోసం ఎన్టీఆర్ ను పూర్తిగా మార్చేసాడు రాజ‌మౌళి.

జుట్టు బాగా పెంచేసి కొత్తగా ఉన్నాడు ఎన్టీఆర్. కాస్త బ‌రువు కూడా పెరిగాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి త‌న కొడుకు కార్తికేయ పెళ్లితో బిజీగా ఉన్నాడు. ఈ పెళ్లి పూర్త‌య్యే వ‌ర‌కు సినిమా వైపు వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు రాజ‌మౌళి. అందుకే ఇప్పుడు త‌న కొత్త లుక్ ను దాచేసి కూడా ప్ర‌యోజ‌నం లేదు అనుకుని హాయిగా త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అలా సినిమాకు కూడా ఫ్రీ పబ్లిసిటీ వ‌చ్చేస్తుంది. ఎలాగూ ఖాళీగానే ఉన్నాడు కాబ‌ట్టి ఈ గ్యాప్ లో యాప్పి ఫిజ్ యాడ్ కూడా షూట్ చేయ‌నున్నాడు జూనియ‌ర్. దీనికి తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌న్న‌డ‌లో కూడా ఎండోర్స్ చేయ‌బోతున్నాడు ఎన్టీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here