విజ‌య్ దేవ‌ర‌కొండ కావాలంటున్న ఝాన్వీక‌పూర్.. 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? అంతా ఈ కుర్ర హీరోకు ఫిదా అయిపోతున్నారిప్పుడు. మ‌రీ చెప్పాలంటే మ‌నోడి టైమ్ న‌డుస్తుందంతే. ఎన్ని రోజులు ఈ క్రేజ్ ఉంటుందో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం విజ‌య్ సూప‌ర్ స్టార్. ఈయ‌న పేరు బాలీవుడ్ లో కూడా మార్మోగిపోతుంది. అక్క‌డ మ‌నోడి స్టైల్స్ గురించి చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పుడు కూడా విజ‌య్ దేవ‌రకొండ గురించి కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో టాపిక్ వ‌చ్చింది.

అక్క‌డ ఈ హీరో గురించి ప్ర‌త్యేకంగా ఇంట్రో ఇచ్చాడు క‌ర‌ణ్ జోహార్. ఈ షోకు అర్జున్ క‌పూర్, ఝాన్వీక‌పూర్ వ‌చ్చారు. అన్నాచెల్లెళ్ల‌ను ప‌క్క‌ప‌క్క‌నే కూర్చోబెట్టి అన్ని విష‌యాలు అడిగాడు క‌ర‌ణ్.ముఖ్యంగా ఝాన్వీక‌పూర్ ను మాత్రం నువ్వు పొద్దున్నే లేచి చూడ‌గానే ఏ హీరోలా మారిపోతావ్ అని అడిగితే మ‌రో ఆలోచ‌న లేకుండా విజ‌య్ దేర‌వ‌కొండ అనే స‌మాధానం ఇచ్చింది ఈ భామ‌. లేచి త‌న‌తో ఓ సినిమా చేయాలంటూ కోరుకుంటాన‌ని చెప్పింది.
అంటే దాన్నిబ‌ట్టి విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఝాన్వీక‌పూర్ మ‌న‌సు ఎలా పారేసుకుందో అర్థ‌మైపోతుంది. ఏ ద‌ర్శ‌కుడు అయినా కాస్త ట్రై చేస్తే ఝాన్వీని తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకుని రావ‌చ్చు. విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే చాలా మందికి తెలియ‌దేమో అంటూ క‌ర‌ణ్ జోహార్ వివ‌ర‌ణ ఇవ్వ‌బోతుంటే అర్జున్ రెడ్డి అంటూ అర్జున్ క‌పూర్ కూడా చెప్పాడు. ఆ హీరో స్టైల్ ఇప్పుడు సౌత్ లో సంచ‌ల‌నం అంటూ చెప్పుకొచ్చాడు క‌ర‌ణ్ జోహార్. ఏదేమైనా విజ‌య్ దేవ‌ర‌కొండ రేంజ్ రోజురోజుకీ పెరిగిపోతుంద‌బ్బా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here