ఫేస్ బుక్ లోకి జ‌న‌సేనాని.. అకౌంట్ తెరిచిన ప‌వ‌న్ క‌ళ్యాణ్..

ఒక‌ప్పుడు సోష‌ల్ మీడియా అంటేనే అవ‌స‌రం లేదు అనుకునేవాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అందుకే ట్విట్ట‌ర్ అకౌంట్ కూడా అంద‌రూ ఓపెన్ చేసిన త‌ర్వాత చివ‌ర్లో తెరిచాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు ట్విట్ట‌ర్ ను త‌న సినిమాల కోసం ఒక్క‌సారి కూడా వాడుకోలేదు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే.. త‌న పార్టీ విధివిధానాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయ‌డం కోస‌మే ఆయ‌న వాడుకుంటూ వ‌చ్చారు. ఇక ఇప్పుడు ఫేస్ బుక్ పేజీని కూడా స్టార్ట్ చేసారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో అధికారికంగా పోస్ట్ చేసారు.

pawan kalyan denduluru porata yatra photoత‌న అభిమానుల‌తో పాటు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు మ‌రింత చేరువయ్యేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పాడు ప‌వ‌న్. ట్విట్ట‌ర్ కంటే ఫేస్ బుక్ లో ఇంకా ఎక్కువ కార్య‌కర్త‌లు ఉంటారు.
అంద‌రికీ అందుబాటులో ఉండేది కూడా ఫేస్ బుక్కే. అందుకే ఇక్క‌డ కూడా త‌న హ‌వా మొద‌లుపెట్టాడు ప‌వ‌ర్ స్టార్. జ‌న‌సేన సిద్ధాంతాలు.. పార్టీ కార్య‌క్ర‌మాలు అనుక్ష‌ణం ప్ర‌జ‌ల‌తో పంచుకోడానికి ఫేస్‌బుక్ పేజీని ఓపెన్ చేసాన‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్.

ఈ క్ర‌మంలోనే ఈయ‌న న‌వంబ‌ర్ 2న విజ‌య‌వాడ నుంచి తుని వ‌ర‌కు రైలు యాత్ర చేయ‌నున్నాని ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. అందులో ప్ర‌జ‌ల‌తోనే క‌లిసి ఈ యాత్ర చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. వాళ్ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకునే క్ర‌మంలో ఇది కూడా ఒక‌టి. ఆ యాత్ర‌కు సంబంధించిన ప్ర‌తీ అప్ డేట్ ఫేస్ బుక్ లో కూడా ఉంటుంద‌ని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. ప‌వ‌న్ ఎంట్రీతో అభిమానులు ఇప్పుడు పండ‌గ చేసుకుంటున్నారు. ఈ దెబ్బ‌తో జ‌న‌సేనాని జ‌నానికి మ‌రింత చేరువ కావ‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here