ఒడియ‌న్ డిజాస్ట‌ర్.. మోహ‌న్ లాల్ కు మామూలు దెబ్బ కాదు..

కొన్నేళ్లుగా హిట్ త‌ప్ప ఫ్లాప్ లేని హీరో మోహ‌న్ లాల్. కొన్ని సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా నిరాశ ప‌రిచినా కూడా అవి మంచి సినిమాలే. అయితే అటు క‌మ‌ర్షియ‌ల్ కాకుండా.. ఇటు మంచి సినిమా అనే పేరు లేకుండా దారుణంగా టాక్ తెచ్చుకుంది ఇప్పుడు విడుద‌లైన ఒడియ‌న్. ఈ చిత్రం చూసి మోహ‌న్ లాల్ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. మ‌న ద‌గ్గ‌ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి.. మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం చూస్తున్న‌పుడు ఫ్యాన్స్ ఎంత‌గా అల్లాడిపోయారో ఇప్పుడు ఒడియ‌న్ ప‌రిస్థితి అలాగే ఉంది మ‌ళ‌యాలంలో.

Is Odiyan Flop Movie ?

ఈ చిత్రానికి మార్నింగ్ షో నుంచే దారుణ‌మైన టాక్ తెచ్చుకుంది. కొన్నేళ్లుగా అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ లే కొడుతూ వెళ్తున్నాడు మోహ‌న్ లాల్. ఇప్ప‌టికే ఈయ‌న ట్రాక్ రికార్డ్ చూసి స్టార్ హీరోలంతా కుళ్ల‌కుంటున్నారు. అస‌లు ఇలాంటి రికార్డులు సాధ్య‌మేనా అని నోరెళ్ల‌బెట్టుకుంటున్నారు. మ‌న కంటే ప‌ది రెట్లు చిన్న‌దైన మ‌ళ‌యాల ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఈ రోజు కేవ‌లం మోహ‌న్ లాల్ కార‌ణంగా పెద్ద ఇండ‌స్ట్రీ అయిపోయింది.

అయితే ఇప్పుడు మోహ‌న్ లాల్ కూడా త‌ప్పులో కాలేసాడు. ఒడియ‌న్ తో చరిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ ఇవ్వ‌బోతున్నాడు. 57 ఏళ్ల వ‌య‌సులో 20 కేజీలు త‌గ్గి సొంతంగా యాక్ష‌న్ సీక్వెన్సులు చేసాడు ఈ చిత్రం కోసం. కేర‌ళ ఒక‌ప్ప‌టి జాన‌పద క‌ళ ఈ చిత్ర క‌థ‌. వేషాలు మార్చి జ‌నాన్ని భ‌య‌పెట్ట‌డం ఈ చిత్ర కాన్సెప్ట్. అలాంటి పాత్ర‌లో బాగానే ఒదిగిపోయాడు మోహ‌న్ లాల్. కానీ క‌థే క‌న్విన్సింగ్ గా లేక‌పోయేస‌రికి ఫ్లాప్ అంచున నిలిచింది. మొత్తానికి చాలా ఏళ్ళ త‌ర్వాత మోహ‌న్ లాల్ అంచ‌నాలు మొత్తానికే త‌ప్పాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here