ఇలియానా ఇక్క‌డే ఉంటానంటుందే.. ఏం చేస్తారిప్పుడు..?

ఇలియానా.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆరేళ్ల త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీతో వ‌స్తుంది. ఒక‌ప్పుడు ఆమె ఏంటి అనే దానిక‌న్నా కూడా ఇప్పుడు ఏంటి అనేది అంద‌రికీ కావాలి. ఇప్పుడు ఆమె సాధార‌ణ హీరోయిన్ కానీ స్టార్ హీరోయిన్ అయితే కాదు. కానీ ఆమెకు 2 కోట్లు ఇచ్చి మ‌రీ స్టార్ హీరోయిన్ ను చేసారు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ టీం. దాంతో ఇప్ప‌టికీ తెలుగులో త‌న‌కు అదే ఇమేజ్ ఉంద‌నుకుంటుంది ఈ భామ‌. ఈ చిత్రంలో అచ్చంగా హాలీవుడ్ హీరోయిన్ మాదిరే ఉంది ఇలియానా.

ileana

అయినా రీ ఎంట్రీ ఇచ్చేవ‌ర‌కు ఓ అనుమానం.. ఇచ్చిన త‌ర్వాత మ‌రో అనుమానం. ఇప్పుడు ఇలియానా తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఉంటుందా.. లేదంటే ర‌వితేజ సినిమాతో ఏదో చుట్ట‌పుచూపుగా న‌టించి వెళ్లిపోతుందా.. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇదే అనుమానం ఉంది. ఎంద‌కుంటే త‌మ సినిమాల్లోనూ ఇలియానాను తీసుకోవాలంటే ఆమె ఏం అంటుందో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇప్పుడు ఆమె ఉన్న రేంజ్ ను మ‌న నిర్మాత‌లు త‌ట్టుకుంటారా అనేది అనుమాన‌మే. ఎందుకంటే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కోసం ఖాళీగా ఉన్న ఇల్లీని తీసుకొచ్చి ఏకంగా రెండుకోట్లు చదివించుకున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్. మ‌ళ్లీ అందులో హోట‌ల్ బిల్స్.. అమ్మ‌గారి సౌక‌ర్యాలు కూడా అద‌నం. అవ‌న్నీ కాకుండానే రెండు కోట్ల‌కు పైగా ఇలియానా రెమ్యున‌రేష‌న్. ఇదే అమౌంట్ ఇస్తే పాత ఇలియానా ఎందుకు.. కొత్త పూజాహెగ్డేలే ఎగురుకుంటూ వ‌స్తారు క‌దా అంటున్నారు కొంద‌రు నిర్మాత‌లు. మ‌రోవైపు గోవాబ్యూటీ మాత్రం ఈ చిత్రం త‌ర్వాత తాను తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఉంటాన‌ని చెబుతుంది.

ఇంట‌ర్వ్యూల‌కు కూడా వ‌స్తుంది. ప్ర‌మోష‌న్ కూడా భారీగానే చేస్తుంది. ఇప్ప‌ట్లో ముంబై వెళ్లే ఆలోచ‌న‌లు కూడా ఈ భామ‌కు ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం హిందీలో ఒక్క సినిమా కూడా ఇలియానా చేతుల్లో లేదు. మ‌రోవైపు న‌వంబ‌ర్ 16న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌ల కానుంది. అప్పుడు తెలుస్తుంది ఈ భామ చూపులు ఎక్క‌డున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here