ఇలియానా.. ఆరేళ్ళ త‌ర్వాత అస‌లు క‌థ‌..

ఆఫ్ట‌ర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి ఖైదీ నెం.150లో చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. ఇప్పుడు ఇలియానా కూడా ఇదే అంటుంది. ఈ భామ కూడా ఆరేళ్ళ త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తుంది తెలుగు ఇండ‌స్ట్రీలోకి. ఈమె న‌టించిన అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ మ‌రికొన్ని గంట‌ల్లో విడుదల కానుంది.

Ileana

దాంతో ఎక్క‌డ‌లేని టెన్ష‌న్ ప‌డుతుంది. పైగా ఇక్క‌డే ఉండాల‌ని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ హిట్టైతే కానీ ఇల్లీబేబీ ఆశ‌లు తీర‌వు. ఇక్క‌డే ఉండాలంటే హిట్టు కొట్టాల్సిందే.. మ‌ళ్లీ ప్లాప్ కానీ వ‌చ్చిందంటే అదే గోవాఫ్లైట్ ఎక్కించి వెన‌క్కి పంపించేస్తారు మ‌న ద‌ర్శ‌కులు. దాంతో టెన్ష‌న్ ప‌డుతుంది ఈ ముద్దుగుమ్మ‌. అయినా రీ ఎంట్రీ ఇచ్చేవ‌ర‌కు ఓ అనుమానం.. ఇచ్చిన త‌ర్వాత మ‌రో అనుమానం. తెలుగు ఇండ‌స్ట్రీ లోనే ఉండాల‌ని ఇప్పుడు ఫిక్సైపోయింది ఇలియానా.
మొన్న‌టి వ‌ర‌కు చిన్న అనుమానం ఉండేది కానీ ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ప్ర‌మోష‌న్స్ లో కూడా ఇదే చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.

దాంతో ఆమెను తీసుకోడానికి నిర్మాత‌ల‌కు కూడా లైన్ క్లియ‌ర్ అయిపోయింది. అయితే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ హిట్ కూడా అయితే మ‌ళ్లీ రీ ఎంట్రీ అదిరిపోతుంది. అయితే ఇప్పుడు ఆమె ఉన్న రేంజ్ ను మ‌న నిర్మాత‌లు త‌ట్టుకుంటారా అనేది అనుమాన‌మే. ఎందుకంటే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కోసం ఖాళీగా ఉన్న ఇల్లీని తీసుకొచ్చి ఏకంగా రెండుకోట్లు చదివించుకున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్. మ‌ళ్లీ అందులో హోట‌ల్ బిల్స్.. అమ్మ‌గారి సౌక‌ర్యాలు కూడా అద‌నం. అవ‌న్నీ కాకుండానే రెండు కోట్ల‌కు పైగా ఇలియానా రెమ్యున‌రేష‌న్. ఇదే అమౌంట్ ఇస్తే పాత ఇలియానా ఎందుకు.. కొత్త పూజాహెగ్డేలే ఎగురుకుంటూ వ‌స్తారు క‌దా అంటున్నారు కొంద‌రు నిర్మాత‌లు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇలియానా రీ ఎంట్రీ ఎలా సాగుతుంద‌నేది చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here