హైపర్ ఆది త‌ప్పుకున్నాడా.. త‌ప్పించారా..?

జబర్ధస్త్ షో చూస్తున్న వాళ్ల‌కు ఈ అనుమానం క‌చ్చితంగా వ‌చ్చే ఉంటుంది. కొన్ని వారాలుగా హైప‌ర్ ఆది క‌నిపించ‌డం లేదు.. తొలివారం చూసి ఏదో షూటింగ్ లో బిజీగా ఉన్నాడేమో అనుకున్నారు.. రెండో వారం చూసి ఇంకా అలాగే ఉన్నాడేమో అనుకున్నారు కానీ మూడు నాలుగు వారాలు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ హైప‌ర్ ఆది క‌నిపించ‌డం లేదు.. జాడ లేదు. దాంతో ఇప్పుడు అంద‌రికీ అనుమానాలు మొద‌ల‌య్యాయి.

నిజంగానే జ‌బ‌ర్ద‌స్థ్ నుంచి ఆది వెళ్లిపోయాడా లేదంటే వాళ్లే త‌ప్పించారా..? ఇప్పుడు ఉన్న సిచ్యువేష‌న్ లో ఆదిని త‌ప్పించేంత సినిమా అయితే లేదు ఎందుకంటే ఆయ‌న స్కిట్స్ బ్ర‌హ్మాండంగా పేలుతున్నాయి. వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఆది త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. జ‌బ‌ర్ద‌స్థ్ చూస్తున్న వాళ్ళంద‌రికీ హైపర్ ఆది గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు.

jabardasth hyper aadi
jabardasth hyper aadi

పంచ్ డైలాగుల‌తో సునామీలా దూసుకొచ్చాడు ఆది. త‌ర్వాతే ఆది కాస్తా హైప‌ర్ ఆది అయ్యాడు. ప్ర‌స్తుతం ఈయ‌న దృష్టి సినిమాల‌పై ప‌డింద‌ని తెలుస్తుంది. జ‌బ‌ర్ద‌స్థ్ రెమ్యున‌రేష‌న్ పెంచాల్సిందే అని ప‌ట్టుబ‌ట్టి త‌న దారి త‌ను చూసుకున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే కేవ‌లం ఇది మాత్ర‌మే కార‌ణం కాదు.. ఆయ‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అభిమానం దృష్ట్యా ఇప్పుడు జ‌నసేన త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి కూడా టైమ్ కేటాయించాడ‌ని తెలుస్తుంది.

అందుకే ఈ కామెడీ షోకు కొన్ని రోజులు దూరం కానున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఎందులో నిజం ఉందో తెలియ‌దు కానీ హైప‌ర్ ఆది కామెడీని మాత్రం ప్రేక్ష‌కులు చాలానే మిస్ అవుతున్నారు. మ‌ళ్లీ ఆయ‌న ఎప్పుడు బ్యాక్ అయినా కూడా ఆడియ‌న్స్ ఫుల్ హ్యాపీస్ అన్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here